NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు సినిమా

నాడు సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్ .. నేడు మెగాస్టార్ నిర్ణయాన్ని స్వాగతించిన వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి

వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కీలక ప్రకటనపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చిరు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో ఇల్లు కట్టుకుని ఇక్కడ స్థిరపడాలనేది తన కోరిక అని అందుకే భీమిలి రోడ్డులో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి తెలిపారు. త్వరలో తాను విశాఖ వాసిని అవుతానని పేర్కొన్నారు. తాను కొనుగోలు చేసిన భూమిలో త్వరలో గృహ నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. చిరు చేసిన ఈ ప్రకటనపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ .. ఏపి కార్యనిర్వహణ రాజధాని విశాఖపట్నంలో స్థిరపడాలని మెగాస్టార్ తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు.  ఇదే సందర్భంలో త్వరలో రిలీజ్ కాబోయే వాల్తేర్ వీరయ్య చిత్రం గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని విజయసాయి తెలిపారు.

YCP MP Vijayasai Reddy Welcomed on chiranjeevi comments on Visakha

 

ఆదివారం విశాఖలో వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంలో చిరంజీవి.. విశాఖ ప్రాంతాన్ని, విశాఖ ప్రజలను ప్రశంసించారు. ఇక్కడి ప్రజలు కుళ్లుకుతంత్రాలకు తావు ఇవ్వరని అన్నారు. ఇక్కడ కాస్మోపాలిటన్ కల్చర్ కనిపిస్తుందన్నారు. ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. అందుకే తాను విశాఖలో సెటిల్ అవ్వాలని అనుకుని ఈమధ్యే భీమిలి రోడ్డులో స్థలం కూడా తీసుకున్నట్లు చెప్పారు. విశాఖ ఎప్పుడొచ్చినా తనకు అహ్లాదకరంగా ఉంటుందన్నారు. త్వరలో ఇల్లు కట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టాలని అన్నారు.

గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన సమయంలోనే చిరంజీవి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఆయన సోదరుడు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ సహా వివిధ రాజకీయ పక్షాలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా చిరంజీవి మాత్రం సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్ధించారు. స్వాగతించారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని చిరంజీవి అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారని చిరంజీవి ప్రశంసించారు. జగన్మోహనరెడ్డి నిర్ణయం వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఏపి ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా చేస్తున్న విశాఖ ప్రాంతంలో సెటిల్ కావాలని అనుకుంటున్నానని పేర్కొనడం విశేషం.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri