NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ .. గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షలో కీలక సూచనలు

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఇవేళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ .. పలువురి ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది. మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహిస్తే కుదరదని స్పష్టం చేశారు. గడపగడపకు కార్యక్రమాన్ని ఆషామాఫీగా నిర్వహిస్తే ఊరుకోనని జగన్ హెచ్చరిస్తూ, ఆ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని జగన్ స్పష్టం చేశారుట. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ప్రారంభించనున్న కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు.

AP CM YS Jagan

 

జగనన్నే మా భవిష్యత్తు అన్న నినాదంతో ప్రతి గడపగకూ వెళ్లి గృహ సారథులు పని చేయాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య వ్యత్యాసం వివరించాలని తెలిపారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కొనసాగించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా మిగతా జిల్లాల్లో నిర్వహించాలని జగన్ సూచించారు. దాదాపు అయిదు లక్షల మంది గృహ సారధులను నియమించుకున్నామనీ, ఫిబ్రవరి 16 లోగా అక్కడక్కడా మిలిగిపోయిన నియామకాలు పూర్తి చేయాలన్నారు. గృహ సారధులు, సచివాలయ కన్వీనర్ల మొదటి బ్యాచ్ కు శిక్షణ కార్యక్రమాలు 387 మండలాల్లో ముగిశాయనీ, రెండో బ్యాచ్ కు శిక్షణ కార్యక్రమాలు మిగిలిన మండలాల్లో రేపటి నుండి ప్రారంభించి ఫిబ్రవరి 19 వరకూ ముగించాలన్నారు.

YSRCP Meeting

 

మండలాల వారీగా జరిగే ఈ శిక్షణా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమాలు ముగిసిన తర్వాత క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మార్చి 18 నుండి 26వరకూ జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ ను పార్టీకి చెందిన సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు డోర్ టు డోర్ నిర్వహించనున్నారు. సుమారు 14 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయనీ, టీడీపీ సహా వారి అనుకూల మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని జగన్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల విజయానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని చెప్పారు.

 ఏపి ప్రభుత్వ చర్యలపై ప్రశంసలు కురిపించిన ఆస్ట్రేలియా ఎంపీల వాణిజ్య ప్రతినిధుల బృందం

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju