NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వివేకా హత్య కేసు దర్యాప్తు పరిణామాలపై సజ్జల సంచలన కామెంట్స్

వైఎస్ వివేకా నంద రెడ్డి హత్య కేసు పై ప్రభుత్వ సలహదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వివేకా హత్యపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అర్జంటుగా చంద్రబాబును ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టే ప్రయత్నం ఒక సెక్షన్ మీడియా చేస్తుందని అన్నారు. కట్టుకథలను అల్లి వాటిని నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇవేళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో ఎల్లో మీడియా యదేశ్చగా ట్రయల్ చేస్తొందనీ, అధికారం ఉంటే తీర్పుకూడా ఇచ్చేదేమోనని సెటైర్ వేశారు. దస్తగిరి మాటలను పతాక శీర్షికల్లో ప్రచురిస్తొందనీ, అతని మాటలకు అధిక ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. కానీ అతని స్టేట్ మెంట్లు పరస్పరం విరుద్దంగా ఉన్నాయన్నారు. ఇదంతా చూస్తుంటే దస్తగిరిని ఆర్గనైజ్ చేసి మాట్లాడిస్తున్నట్లుగా కనిపిస్తొందని సజ్జల అభిప్రాయపడ్డారు.

sajjala Rama Krishna Reddy

 

విపక్షాల పొలిటికల్ ఎజెండాలో భాగంగానే అవినాష్ కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నారని సజ్జల విమర్శించారు. వివేకా కేసును రాజకీయ ఎజెండాలో భాగంగానే టీడీపీ వాడుకుంటోందనీ, తద్వారా నీచ స్థాయికి దిగజారిందని సజ్జల అన్నారు. చంద్రబాబు క్షుద్ర విన్యాసంలో భాగంగానే ఇదంతా నడుస్తొందని దుయ్యబట్టారు.  ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి లను ఇరికించే కుట్రకు తెరలేపారని అన్నారు. నేరం మోపాలని ముందుగానే నిర్ణయానికి వచ్చారని మండిపడ్డారు. తమ పాలనలో ప్రజలకు ఏమి చేశారమన్నది చెప్పుకోవడానికి టీడీపీ దగ్గర ఏమి లేదనీ, అందుకే వివేకా కేసును ఓ పథకం ప్రకారమే వాడుకుని సీఎం జగన్ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా కుట్ర చేస్తొందని అన్నారు సజ్జల. జగన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియకే ఈ నాటకాలు చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల కోసం ఓ కథ సిద్దం చేసుకుంటున్నారనీ, ఇదంతా వచ్చే ఎన్నికల్లో పని చేస్తుందేమోనని టీడీపీ దురాశ అని సజ్జల అన్నారు.

హత్య ఎలా చేశాడనేది దస్తగిరి స్వయంగా చెప్పాడనీ, అసలు దస్తగిరిని అప్రూవర్ గా మార్చి బెయిల్ ఇప్పించింది ఎవరు అని ప్రశ్నించారు సజ్జల. ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగన్న ఉండగా, అప్రూవర్ మాటల్ని ఎందుకు సీబీఐ  పట్టించుకుంటోందని ప్రశ్నించారు. కేసు తేలని సమయంలోనే అప్రూవర్ గా మార్చారని, విచారణ పేరుతో ఓ డ్రామా నడిపిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. వివేకా హత్య కేసులో సీబీఐ ఇష్టానుసారంగా పేర్లు చేరుస్తుంటే ఎల్లో మీడియా ప్రింట్లు వేస్తొందని అన్నారు. విచారణ తీరు చూస్తుంటే సీబీఐ, టీడీపీ కుమ్మక్కై విచారణ జరుపుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.

ఏకపక్షంగా దర్యాప్తు చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. మిగిలిన కోణాలవైపు చూడకపోవడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించారు సజ్జల . రాంసింగ్ ను మార్చి కొత్త టీమమ్ వచ్చిన తర్వాత కొత్త ఆధారాన్ని ఏమైనా సంపాదించారా అని ప్రశ్నించారు. రాంసింగ్ పూర్తి చేయాలనుకున్న పనిని  ఈ కొత్త టీమ్ పూర్తి చేయాలని వచ్చినట్లు ఉందని అన్నారు. ఈ నెల 30లోగా తమకు నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతోనే ఈ హడావుడి ద్వారా ఏదో ఒకటి చేసి మమ అని అనిపించాలనుకుంటున్నారని అన్నారు.   దర్యాప్తు పేరుతో జరుగుతున్న తతంగాన్ని ఎదుర్కొంటామని చెప్పారు. వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి లపై కేసులు నిలవవని అన్నారు. కొంత కాలం ఇబ్బంది పెడతారేమో కానీ చివరికి న్యాయమే గెలుస్తుందని సజ్జల అన్నారు.

తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju