NewsOrbit
జాతీయం న్యూస్

తీహార్ జైలులో గ్యాంగ్ వార్ .. గ్యాంగ్ స్టర్ టిల్లు తాజ్ పురియా హత్య

Gangster Tillu Tajpuriya Killed Inside Delhi's Tihar jail by rival gang members

ఢిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ టిల్లు తాజ్ పురియాను తీహార్ జైలులో ప్రత్యర్ధి ముఠా సభ్యులు హత్య చేసినట్లు జైలు అధికారుల మంగళవారం తెలిపారు. గ్యాంగ్ స్టర్ లు టిల్లూ పూరియా, జితేందర్ గోగి గ్యాంగ్ కు మధ్య గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జితేందర్ గోగిని టిల్లు హత్య చేయించాడని పోలీసులు తెలిపారు. 2021 లో రోహిణి కోర్టుకు హజరై జితేందర్ ను టిల్లూ గ్యాంగ్ సభ్యులు కాల్చి చంపారు. న్యాయవాదుల మాదిరిగా నల్లకోట్లు ధరించిన గ్యాంగ్ స్టర్లు కోర్టు లోపల విచారణ జరుగుతుండగా కాల్పులు జరిపారు. దీంతో జితేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో హంతకులు ఇద్దరూ చనిపోయారు.

Gangster Tillu Tajpuriya Killed Inside Delhi's Tihar jail by rival gang members
Gangster Tillu Tajpuriya Killed Inside Delhi’s Tihar jail by rival gang members

 

ఈ హత్య నేపథ్యంలో టిల్లు పై జితేందర్ గ్యాంగ్ కక్ష పెంచుకుంది. తీహార్ జైలులోని హై సెక్యురిటీ బ్యారక్ లో ఉన్న టిల్లూపై అదే జైలులో ఉన్న జితేందర్ గ్యాంగ్ సభ్యుడు యోగేశ్ తుండా తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. మంగళవారం ఉదయం ఐరన్ గ్రిల్స్ ను తొలగించుకుని బ్యారెక్ బయటకు వచ్చిన యోగేశ్ అవే రాడ్లతో టిల్లూ పై దాడి చేశాడు. రాఢ్లతో విపరీతంగా కొట్టడంతో టిల్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ గ్యాంగ్ వార్ లో టిల్లుతో పాటు మరోకొరు గాయపడ్డారు.  ఇంతలో జైలు అధికారులు అక్కడికి చేరుకుని యోగేశ్ ను మరో బేరక్ లోకి తరలించారు.

గాయపడిన ఇద్దరిని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తిల్లు చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. తిల్లుతో పాటు గాయపడిన మరో వ్యక్తి రోహిత్ చికిత్స పొందుతున్నాడనీ, అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని డిల్లీ పోలీస్ అదనపు డీసీపీ అక్షత్ కౌశల్ తెలిపారు. జైలులో జరిగిన ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.

IT Rides: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థపై ఐటీ దాడులు

Related posts

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju