NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Supreme Court: సుప్రీం కోర్టులో అమరావతి రైతులకు దక్కని ఊరట

Supreme Court: సుప్రీం కోర్టులో రాజధాని అమరావతి రైతులకు నిరాశ ఎదురైంది. ఆర్ 5 జోన్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వవద్దంటూ రాజధాని రైతులు వేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చుతూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇతర ప్రాంత పేదలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇస్తే తప్పేమిటి, రాజధాని అందరిది అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే హైకోర్టు తీర్పను రాజధాని రైతులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. రైతులు వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు ధర్మాసనం సీజేఐకి రిఫర్ చేసింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ రాజేశ్ బిందాల్ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

Supreme Court

 

అమరావతి పై పిటిషన్లు విచారణను మరో ధర్మాసనం విచారిస్తొందనీ, అలాంటప్పుడు తాము విచారించడం సరికాదని అభిప్రాయపడింది. అమరావతి ప్రధాన కేసుతో పాటు ఆర్ 5 జోన్ నూ కలిపి విచారించడమే సబబని ధర్మాసనం అభిప్రాయపడింది. రైతుల పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు.. శుక్రవారం లోపు ఈ పిటిషన్లపై విచారణకు సంబంధించి ధర్మాసనం ముందు లిస్ట్ చేసేందుకు అనుగుణంగా సీజేఐ నుండి తగిన సూచనలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రెండు పిటిషన్లు ఒకే ధర్మాసనం విచారించాల్సి ఉన్నందున ఆ మేరకు వ్యవహరించాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా సూచించారు.

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలోని దాదాపు 50వేల మంది పేదలకు అమరావతి రాజధాని పరిధిలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం యుద్ద ప్రతిపదికన చర్యలు చేపట్టింది. ఈ చర్యలను అమరావతి రైతులు అడ్డుకుంటూ ఉన్నారు. చివరకు సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేదు. ఈ కేసును రాజధాని కేసులను విచారించే ధర్మాసనానికి బదిలీ చేసింది. అమరావతి రైతుల పిటిషన్ నేపథ్యంలో ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మరో సారి పిలుపు

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N