NewsOrbit
Entertainment News రివ్యూలు

Hatya Movie Review: విజయ్ ఆంటోని అందించిన అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్…కూర్చున్న చోటే కట్టిపడేసే కథ కథనం! Sony Liv Upcoming Movie

Hatya Movie Review: Hatya Telugu movie review starring Vijay Antony, Ritika Singh, and Meenakshi Chaudhary

Hatya Movie Review: విజయ్ ఆంటోని పేరు వినగానే ఎవరికైనా ‘బిచ్చగాడు’ సినిమా తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో ఆయన నటన కళ్లముందు కదలాడుతుంది. ఈ సినిమా తరువాత తన సినిమాలను కొన్నిటిని తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేశాడుగానీ అవి అంతగా ఆడలేదు. ఆయన సినిమాలు కొంత విభిన్నంగా ఉంటాయనే పేరు మాత్రం వచ్చింది.

Hatya Movie Review: Hatya Telugu movie review starring Vijay Antony, Ritika Singh, and Meenakshi Chaudhary
Hatya Movie Review: Hatya Telugu movie review starring Vijay Antony, Ritika Singh, and Meenakshi Chaudhary

ఆయన తాజా చిత్రంగా తమిళంలో ‘కొలై’ రూపొందింది. తెలుగులో ‘హత్య’ గా అనువదించారు. పేరు ను బట్టి ఈ కథ ఒక హత్య చుట్టూ తిరుగుతుందనే విషయం అర్థమవుతూనే ఉంది. యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. కమల్ బొహ్ర .. ధనుంజయన్ .. ప్రదీప్ నిర్మించిన ఈ సినిమాకి బాలాజీ కుమార్ దర్శకత్వం వహించాడు.

కద టూకీగా ఏమిటంటే హైదరాబాద్‌లో గాయని గాను మోడల్‌గాను రాణిస్తున్న లైలా (మీనాక్షి చౌదరీ)కి సతీష్ (సిద్దార్థ శంకర్) అనే బాయ్‌ఫ్రెండ్ ఉంటాడు. లైలా జీవితం హాయిగా గడిచిపోతున్న సమయంలో ఆమె తన ఇంట్లోనే హత్యకు గురవుతుంది. ఈ హత్య చాలా అనుమానాలను రేకెత్తిస్తుంది. పోస్టమార్టం రిపోర్ట్ లో ఎవరో పీక నులిమి చంపినట్లు ఉంటుంది. ఈ హత్య ఒక పెద్ద సంచలనాన్ని సృష్టిస్తుంది. ఎలాంటి ఆధారాలు దొరకని ఆ కేసును దర్యాప్తు చేయడానికి పోలీస్ అధికారిణి సంధ్య (రితికా సింగ్) నియమించ బడుతుంది. ఆవిధంగా సంధ్య రంగంలోకి దిగుతుంది. సంధ్య దర్యాప్తు లో సహకరించమని పోలీస్ విచారణాధికారి వినాయక్ (విజయ్ ఆంటోని)ని కోరగా అతను సిద్ధం అవుతాడు

Hatya Movie Review: Hatya Telugu movie review starring Vijay Antony, Ritika Singh, and Meenakshi Chaudhary
Hatya Movie Review: Hatya Telugu movie review starring Vijay Antony, Ritika Singh, and Meenakshi Chaudhary

మోడల్ లైలా హత్యకు అసలు కారణం ఏమిటి? లైలా హత్యకు వరంగల్‌లో జరిగిన భవానీ హత్య కు సంబంధం ఉందా? లైలా హత్య కేసులో కౌశిక్ (మురళీ శర్మ)ను ఎందుకు అనుమానించారు? ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవ్ (అర్జున్ చిదంబరం)కు సంబంధం ఉందా? తనను పెంచిన మహిళ కుమారుడు బబ్లూ (కిషోర్ కుమార్)కు లైలా హత్య కు సంభందం ఉందా? లైలా హత్య కేసు చిక్కు ముడిని సంధ్య, వినాయక్ ఎలా ఛేదించారు అనే ప్రశ్నలకు సమాధానమే హత్య సినిమా కథ.

హత్య సినిమాలో వచ్చే కొన్ని పరిశోధన సన్నివేశాలు చాలా ఆసక్తి గా ఉండే అంశాలు. అలాగే క్లైమాక్స్ మెలిక కూడా ఊహకు అందలేదు. దర్శకుడు బాలాజీ కె కుమార్ రాసుకున్న క్రైమ్ డ్రామా కొన్ని చోట్ల ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా సినిమాలో క్లైమాక్స్ ఆకట్టుకుంది. రితికా సింగ్ సీరియస్ పోలీస్ అధికారిణిగా నటన బావుంది . ఇక విజయ్ ఆంటోని నటన హావభావాలు కూడా చాలా బాగున్నాయి.

Hatya Movie Review: Hatya Telugu movie review starring Vijay Antony, Ritika Singh, and Meenakshi Chaudhary
Hatya Movie Review: Hatya Telugu movie review starring Vijay Antony, Ritika Singh, and Meenakshi Chaudhary

క్రైమ్ అండ్ సీరియస్ సన్నివేశాల్లోని విజయ్ ఆంటోని నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. కథ రీత్యా హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రకు అంత పెద్దగా నటించే అవకాశం లేకున్నప్పటికీ ఆమె మెప్పించింది. రాదికా శరత్‌కుమార్ నటన బాగుంది. అలాగే, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, కిషోర్ కుమార్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు ఓ హత్య చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది. హత్య సినిమా ఉత్కంఠ కలిగించే హత్య లోని గోప్యత లాంటి కావాల్సిన అన్ని అంశాలతో ఆసక్తిగా ప్రారంభమవతుుంది. అయితే కథను సరైనా మార్గంలో నడిపించడంలో దర్శకుడు దారి తప్పారనే భావన కలుగుతుంది. కొన్ని దృశ్యాలతో ఫస్టాఫ్ కొంత ఆసక్తి కలిగేలానే సాగుతుంది. కదా లోని చిన్న మెలిక హత్య సినిమా రెండో భాగం పై కుతూహలాన్ని పెంచుతుంది. కానీ వైవిధ్యమైన కధనంతో ఆకట్టుకొనే ప్రయత్నం అంతగా ఫలించలేదు అ ని ట్రరలోనే మనకి తెలుస్తుంది . అర్జున్, కౌశిక్, బబ్లూ కోణంలో హత్య ఎలా జరిగిందనే విషయంపై కథను నడిపించడం ఆకట్టుకోలేదనే చెప్పాలి. చివరకు సినిమాను ముగించాలనే తొందర్లలో ఏదో ఒకటి చేసి హత్య కేసును ముగించే ప్రయత్నం జరిగిందనిపిస్తుంది. కేసు దర్యాప్తు పేరుతో సినిమాను బాగా సాగదీశారనే భావన కలుగుతుంది.

ఈ సినిమా నటీనటుల అభినయమ్ విషయానికి వస్తే.. మీనాక్షి చౌదరీ అందంతో బాగానే ఆకట్టుకొన్నది. ఆమె పాత్ర ను తొందరగా ముగించినప్పటికీ.. మీనాక్షి కథ మొత్తంగా కనిపిస్తుంది. అయితే మీనాక్షికి నటనను ప్రదర్శించడానికి అవకాశం లేకపోయింది. రితికా సింగ్ పోలీస్ ఆఫీసర్‌గా కూడా పర్వాలేదు అనిపించింది. కథ, సన్నివేశాల్లో పస లేకపోవడంతో రితికా చేయడానికి ఏమీ లేకపోయింది. విజయ్ ఆంటోని పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఒక విభిన్నమైన పాత్రలో విజయ్ మెప్పించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు చేశారు.

సాంకేతికంగా చూస్తే , కథ, కథనంలో వేగం, బలం లేకపోవడం వల్ల సంగీతం, కెమెరా విభాగాలకు ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. సాంకేతికంగా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచే ప్రయత్నం కనిపించింది. ఎడిటింగ్ విభాగానికి ఇంకా చాలా పని ఉందనిపిస్తుంది. సినిమాలో నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి, విజయ్ ఆంటోని ఫ్యాన్స్‌కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇది బిచ్చగాడు అంత హిట్ కాదేమో అనిపిస్తుంది. ఒకసారి చూడతగిన సినిమాయీ హత్య.

 

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N