NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: అన్న కి వెన్నుపోటు పొడిచిన వైఎస్ షర్మిల కి చావు దెబ్బ – స్ట్రాంగ్ బిగ్ లీడర్ రాజీనామా !!

YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారు అయిన సంగతి తెలిసిందే. రేపో మాపో వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు షర్మిల. ఇప్పటికే పలు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో షర్మిల చర్చలు జరిపారు. అయితే పూర్తి స్థాయి చర్చల అనంతరం పార్టీ విలీనంపై అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంటుంది. అయితే షర్మిల తన దారి తాను చూసుకుని పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుండటంపై ఇప్పటి వరకూ ఆమె నడిచిన సీనియర్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల చర్యలను తప్పుబడుతున్నారు. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఇప్పటి వరకూ ఆమెతో నడిచిన నేతల పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మాగిలింది. ఇప్పటి వరకూ వైఎస్ఆర్ టీపీలో పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి గతంలో వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడుగానూ పని చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడంతో ఆయన పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కీలక భూమికను పోషించారు.

షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన పార్టీలో వైఎస్ఆర్ బిడ్డ చేరడం ఏమిటని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జగన్మోహనరెడ్డి పై కేసులు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపిస్తే ఆమె వెంట తాము ఎందుకు వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏకంగా ఓ టీవీ లైవ్ డిబేట్ లోనే తను వైఎస్ఆర్ టీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా షర్మిలపైన, కాంగ్రెస్ పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దివంగత వైఎస్ఆర్ కుటుంబాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఎందుకు చేరుతున్నారంటూ నిలదీశారు.

తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు షర్మిల చర్యలను జీర్ణించుకోలేకపోతున్నారన్నారు కొండ. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి ఆయన ప్రతిష్ట కు తీరని మచ్చ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ ను అవమానించిన కాంగ్రెస్ పార్టీకి తాను బద్దవ్యతిరేకినని ఆయన స్పష్టం చేస్తూ తాను ఆ పార్టీలో చేరి రాజకీయాలు చేయలేనని చెప్పారు. షర్మిల తీసుకుంటున్న నిర్ణయంతో ఆమెతో మొదటి నుండి నడిచిన నేతలు పలువురు రాజీనామాకు సిద్దమవుతూ ఆమెకు దూరం కావడం గట్టి షాక్ గానే భావిస్తున్నారు.

రాజశేఖరరెడ్డి మరణానంతరం మెజార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహనరెడ్డిని సీఎం చేయాలని పార్టీ అధిష్టానాన్ని కోరినా అంగీకరించలేని సంగతి తెలిసిందే. ఆ తర్వాత జగన్మోహనరెడ్డి ఓదార్పు యాత్ర నిర్వహణకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీకి వీడిన జగన్మోహనరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని స్థాపించి ఏపిలో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బతీశారు. రాష్ట్ర విభజన అంశంతో పాటు వైఎస్ఆర్ సీపీ మూలంగా 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపిలో బోణీ కొట్టలేకపోయింది.

Aditya L-1 Launch: విజయవంతమైన ఇస్రో ఆదిత్య ఎల్ – 1 ప్రయోగం

 

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N