NewsOrbit
జాతీయం టెక్నాలజీ

Jio Air Fiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ లాంఛ్.. జియో ఎయిర్ ఫైబర్ వల్ల కలిగే లాభాలు.. జియో ఎయిర్ ఫైబర్‌కు జియో ఫైబర్‌కు మధ్య ఉన్న తేడా ఇదే!

Jio Air Fiber Launch On September 19 2023 jio air fiber vs jio fiber details

Jio Air Fiber VS Jio Fiber: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జియో ఎయిర్ ఫైబర్ పేరుతో కొత్త నెట్‌వర్కింగ్ సర్వీస్‌ను లాంఛ్ చేయనుంది. సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ అనే కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్‌ను ప్రారంభించబోతుంది. ఇది గృహాలు, ఆఫీసులు, కార్యాలయాల కోసం రూపొందించబడిన పోర్టబుల్ వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్‌గా రిలయన్స్ కంపెనీ పేర్కొంది. జియో ఎయిర్ ఫైబర్ వైర్‌ లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా గరిష్టంగా 1.5 బీజీ వేగంతో డేటాను పొందవచ్చు. వినాయక చవితి రోజున జియో ఎయిర్ ఫైబర్‌ను అధికారికంగా అందుబాటులోకి రానున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.

టెలికాం రంగంలో రిలయన్స్ ‘జియో’ ప్రభంజనం సృష్టించింది. జియో దెబ్బకు చాలా వరకు టెలికాం కంపెనీలు మూతపడ్డాయనే చెప్పుకోవచ్చు. మరికొన్ని కంపెనీలో ఇతర టెలికాం కంపెనీలతో జతకట్టి.. తమ సేవలను విస్తృతం చేసుకున్నాయి. జియో వల్ల సగటు వినియోగదారుడికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా లభించింది. అయితే వ్యాపార విస్తరణలో భాగంగా జియో కార్యాలయాలకు, ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో ‘జియో ఫైబర్’ను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ప్రస్తుతం ఈ సేవలు పట్టణ ప్రాంతాలకే విస్తరించనున్నాయి. ఆ తర్వాతి కాలంలో గ్రామాలకు కూడా వ్యాపించనున్నాయి. అయితే జియో ఎయిర్ ఫైబర్ వల్ల కలిగే లాభాలు.. అలాగే జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్‌కు ఉన్న తేడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Jio Air Fiber Launch On September 19 2023 jio air fiber vs jio fiber details
Jio Air Fiber Launch On September 19 2023 jio air fiber vs jio fiber details

హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో..
హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో జియో ఎయిర్ ఫైబర్ పని చేస్తుంది. 5జీ సాంకేతికతను ఉపయోగించి ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తుంది. ఇది సాంప్రదాయ ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్‌లతో పోల్చదగిన వేగాన్ని అందిస్తుంది. వినియోగదారుడు గరిష్టంగా 1జీబీపీఎస్ వేగంతో డేటాను వాడుకోవచ్చు. జియో ఎయిర్ ఫైబర్ కాంపాక్ట్ మాత్రమే కాకుండా సెటప్ చేయడం కూడా సులభమని జియో పేర్కొంది. సెటప్ బాక్స్‌లో ప్లగ్ ఇన్ చేసి సులభంగా వైఫై పొందవచ్చని జియో ప్రతినిధులు చెబుతున్నారు.

జియో ఫైబర్ V/S జియో ఎయిర్ ఫైబర్..
జియో ఫైబర్ అనేది ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఇంటర్నెట్. ఇది వైర్డు ఆప్టిక్ కేబుల్ సాయంతో కనెక్ట్ అయి ఉంటుంది. కేబుల్ వైర్ సాయంతో సెట్‌ఆఫ్ బాక్స్‌ను కనెక్ట్ చేసుకుని వైఫై సౌకర్యం పొందుతాము. అయితే జియో ఎయిర్ ఫైబర్ దీనికి భిన్నం. ఫైబర్ పాయింట్ టు పాయింట్ రేడియో లింకులను ఉపయోగించి వైర్‌లెస్ విధానాన్ని తీసుకుంటుంది. దీనికి కేబుల్ వైర్ అవసరం ఉండదు. సులభంగా గృహాలు, కార్యాలయాలను నేరుగా జియోకి వైర్‌లెస్ సిగ్నల్స్ అనుసంధానిస్తుంది. ఇది జియో టవర్‌లతో లైన్ ఆప్ సైట్ కమ్యూనికేషన్‌పై జియో ఎయిర్ ఫైబర్ ఆధారపడుతుంది.

జియో ఎయిర్ ఫైబర్ ఇతర ఉపయోగాలు..
జియో ఎయిర్ ఫైబర్ ద్వారా గరిష్టంగా 1.5 జీబీపీఎస్ ఇంటర్నెట్ వేగాన్ని పొందవచ్చు. అయితే జియో ఎయిర్ ఫైబర్ వేగం సమీప టవర్‌కు సామీప్యతను బట్టి మారుతూ ఉంటుంది. జియో ఎయిర్ ఫైబర్ ‘ప్లగ్ అండ్ ప్లే’ అంటే యూజర్ ఫ్రెండ్లీగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సులభంగా ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. ఈ వైర్‌లెస్ ఇంటర్నెట్ సౌకర్యం పొందడానికి రూ.6,000 వరకు నిర్ణయించినట్లు సమాచారం. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల కంటే కొంచెం ఖరీదైనది. ఎందుకంటే జియో ఎయిర్ ఫైబర్‌లో పోర్టబుల్ డివైజ్ యూనిట్ ఉంటుంది. దీని వల్ల హై స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతకు జైల్ అధికారులు షాక్ .. ములాఖత్‌కు అనుమతి నిరాకరణ..! ఎందుకంటే..?

sharma somaraju

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju