Madhura Nagarilo: మధురానగరిలో, సీరియల్ లో మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్న కీర్తి బట్. ఈమె 1999 జూన్ రెండవ తేదీన బెంగళూరు కర్ణాటకలో జన్మించింది. ఈమె పూర్తి పేరు కీర్తి కేశవ్ బట్. కన్నడంలో ఇమేజ్ చాలా సీరియస్ లో నటించింది వాటితో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. మధుర నగరి లో సీరియల్ లో ఈమె రాధా క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా పండిస్తోంది. ఈ సీరియల్లో కస్తూరి సీరియల్ ప్రేమ్ నాగార్జున ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్నాడు.కెరియర్ పరంగా మంచి పీక్స్ మూమెంట్లో ఉన్న టైంలో కీర్తి జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

పెద్ద యాక్సిడెంట్ ద్వారా తన తల్లిదండ్రులతో పాటు అన్నా వదినని అందరినీ దూరం చేసుకుంది కీర్తి. ఆ యాక్షన్ లో తను కూడా ప్రాణాపాయ స్థితిలో పోరాడుతూ బయటపడింది. చాలా రోజులు కోలుకోలేక కోమాలో ఉంది కీర్తి. కోమలో నుంచి బయటపడిన తర్వాత తల్లి తండ్రి అందరూ చనిపోయారని తెలుసుకొని చాలా బాధగా, తనకు ఎవరూ లేరనిషాక్ అయింది కీర్తి. ఆ బాధని మర్చిపోవడానికి ఆమె ఒక అనాధను దత్తత తీసుకుంటే చివరికి ఆ బిడ్డని కూడా దేవుడు దూరం చేసేసాడు. కష్టాల కడలిని దాటి పడి లేచిన కెరటమే కీర్తి బట్. నిజజీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొని ఇక్కడదాకా వచ్చింది కీర్తిబట్.మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

ఆ సీరియల్ లో వచ్చిన పాపులారిటీతోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టింది. ఫైనల్ లిస్ట్ గా కూడా బిగ్బాస్ 6 లో నిలిచింది కీర్తి. ఆ తర్వాత ఈమె కార్తీకదీపం సీరియల్ లో హిమా క్యారెక్టర్ లో కొన్ని రోజులునటించి మెప్పించింది.ఈమె రీసెంట్గా తనకు కాబోయే భర్తని కూడా అందరికీ స్టార్ మా ఛానల్లో మా బోనాలు జాతరలో పరిచయం చేసింది. ఆ షో లోనే ఆమె ఎంగేజ్మెంట్ చేసుకొని సప్రైజ్ ఇచ్చింది కీర్తి. తనకు కాబోయే వరుడు గురించి ఎక్కడా కూడ ఏ షోలో నువ్వు చెప్పకుండా సడన్గా ఎంగేజ్మెంట్ తో షాక్ ఇచ్చింది అందరికీ కీర్తి. ఆశలో వాళ్ళ అత్తగారు మామగారు ని కూడా తీసుకొచ్చి ఇక కాబోయే భర్తవిజయ్ కార్తీక్.ఇతను కొరియోగ్రాఫర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసి, కన్నడ సినిమాల్లో మరియు తెలుగు సినిమాల్లో కూడా, కొరియోగ్రాఫర్ గాపని చేశారు.

ఆ తర్వాత సేడు అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.నటుడుగా ఉన్న కార్తీక్ కోవిడ్ టైం లో డైరెక్టర్ గా కూడా మారి స్వయంగా ఆయనే కద రాసుకొని తన స్నేహితుని డైరెక్టుగా పెట్టి ఒక సినిమాని మొదలుపెట్టాడు. కొన్ని కారణాల వల్ల తన స్నేహితుడు దూరంగా ఉండడంతో డైరెక్షన్ కి ఏ బి పాజిటివ్ అనే సినిమాకి తనే డైరెక్షన్ చేశాడు. ఇప్పుడు కీర్తి మరియు కార్తీక్ ఇద్దరు ఎంగేజ్మెంట్ తో ఒకటయ్యి వాళ్ల స్నేహాన్ని, ప్రేమ ని కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే కీర్తి, రీసెంట్ గా ఒక పిక్ ను పోస్ట్ చేసి,తన మనసులో మాటలను స్టోరీలో పోస్ట్ చేసింది.

ఆమె ఎందుకు అలా మాట్లాడిందో, తెలియదు కానీ తన మనసులో బాధ అయితే ఉంది అన్న విషయం ఈ పోస్ట్ ద్వారా అందరికీ అర్థమవుతుంది ఆ పోస్టులో అసలు ఏముందంటే”మేము కేవలం రెండు రోజుల్లో చాలా పాఠాలు నేర్చుకున్నాము. అందరూ నా వారిని భావించాను క్షమించండి ఎవరూ లేరు నేను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను చివరిగా మీ అందరికీ ఒక మాట ఎవరిని మీరు నమ్మొద్దు మిమ్మల్ని మీరు నమ్ముకోండి” అనితనకి కాబోయే శ్రీవారితో వున్నా ఒక ఫోటోని పోస్ట్ చేసింది కావ్య. ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన వారంతా కీర్తికి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తూ, తనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మీరు ఒకసారి ఆ ఫోటోని చూసేయండి