NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandrababu: సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు

Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ను క్వాష్ చేయాలని పిటిషన్ లో చంద్రబాబు కోరారు. సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ కాపీని చంద్రబాబు తరపు న్యాయవాదులు అందజేశారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వస్తుందని భావిస్తున్నారు.

ఒక వేళ సోమవారం విచారణకు రాకపోతే ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసి.. వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశం ఉంది. ఈ నెల 26వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకూ సుప్రీం కోర్టు సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ లోపుగానే సుప్రీం కోర్టులో విచారణకు వచ్చేలా చంద్రబాబు తరపు న్యాయవాదులు సీజే ధర్మాసనం ముందు ప్రత్యేకంగా మెన్షన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని హైకోర్టు తెలిపింది. 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.

మరో పక్క సీఐడీ కస్టడీపై ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించినట్లుగా తెలుస్తొంది. కాగా ఏసీబీ కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీ విచారణ నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన చంద్రబాబు సీఐడీ విచారణ వైద్య పరీక్షల కారణంగా ఆలస్యంగా ప్రారంభం అయినట్లుగా తెలుస్తొంది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో అధికారుల బృందం .. చంద్రబాబు న్యాయవాదుల సమక్షంలో ఆయనను విచారణ జరుపుతోంది.

Chandrababu Arrest: చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ అధికారుల బృందం

Related posts

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju