Rakshit Rashmika: కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రష్మిక మందన.. టాలీవుడ్ లో అడుగు పెట్టాక తలరాత మారిపోయిన సంగతి తెలిసిందే. తెలుగులో రష్మిక మందన నటించిన సినిమాలు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో విజయాలు సాధించాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట “చలో” తర్వాత “గీతగోవిందం” వంటి రెండు రొమాంటిక్ సినిమాలు తో కుర్రాలను ఆకట్టుకుని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అనంతరం సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” ఊహించిన విజయం సొంతం చేసుకుంది. రష్మిక మందన కెరియర్ లో అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే.. “పుష్ప” మరొక ఎత్తు.
ఇదిలా ఉంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలు అడుగుపెట్టకు ముందు కనడ ఇండస్ట్రీలో హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించింది. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. మరి కొద్ది రోజులలో పెళ్లి అని అనుకున్న సమయంలో విడిపోవడం జరిగింది. ఆ తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రష్మిక మందన తిరుగులేని కెరియర్ తో దూసుకుపోతూ.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. ఇదిలా ఉంటే హీరో రక్షిత శెట్టి ఇటీవల పీపుల్స్ ఫ్యాక్టరీ మీడియా సంస్థ ఆధ్వర్యంలో సప్త సాగర దాచే ఎల్లో హలో సినిమా చేయడం జరిగింది. కన్నడ తమిళ్ మలయాళం తెలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి కి జోడిగా రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలో నటించగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు హేమంత్ ఏం రావు దర్శకత్వం వహించారు.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మాజీ ప్రియురాలు రష్మిక మందన పై రియాక్ట్ అయ్యారు. రష్మిక మందనాతో ఇంకా టచ్ లో ఉన్నారా..? అని ప్రశ్నించగా ఎస్ ఆమెతో టచ్ లోనే ఉన్నాను. ఇదే సమయంలో మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా అంటే అవును త్వరలో చేసుకోబోతున్నాను అని జవాబు ఇచ్చారు. ఆ అమ్మాయి ఎవరు అంటే త్వరలోనే మీకు అందరికీ తెలిసేలా ప్రకటించాకే పెళ్లి చేసుకుంటానని రక్షిత్ శెట్టి స్పష్టం చేయడం జరిగింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం కర్ణాటకలో మోడలింగ్ రంగంలో రాణిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆ అమ్మాయి రష్మిక కంటే వందరేట్లు అందంతో పాటు బాగా ఆస్తిపరురాలని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మే నెలలోపు హీరో రక్షిత్ శెట్టి సదరు కన్నడ మోడలింగ్ అమ్మాయితో జరగబోతున్నట్లు సమాచారం.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!