NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: ఢిల్లీలో నారా లోకేష్ కు నోటీసులు అందజేసిన ఏపీ సీఐడీ అధికారులు

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఢిల్లీలో ఉన్న ఆయనను కలిసిన సీఐడీ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు హజరు కావాలని సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోకా రోడ్డ్ లో గల గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేశ్ ఉండగా, ఏపీ సీఐడీ అధికారులు వెళ్లి నోటీసులు అందజేశారు. ఈ సందర్భంలో అధికారులకు విచారణకు హజరు అవుతానని లోకేష్ చెప్పినట్లుగా తెలుస్తొంది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ వ్యవహారంపై గత ఏడాది నమోదు చేసిన కేసులో ఏ 14 గా లోకేష్ పేరును సీఐడీ ఇటీవల చేర్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరపగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేష్ కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని, దానికి సంబంధించి నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్ లో మార్పులు చేశారని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

nara lokesh

సీఆర్పీసీ 41 ఏ నోటీసులు అంటే అరెస్టు ప్రస్తావన రానందున .. ముందస్తు బెయిల్ పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లారు. తొలుత సీఐడీ అధికారులకు లోకేష్ ఆచూకీ లభించలేదని వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు లోకేష్ ఆచూకీని కనుగొన్న సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. ఇక,  స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో లోకేష్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

లోకేష్ దాఖలు చేసిన పై రెండు ముందస్తు బెయిల్ పిటిషన్ లపై విచారణను ఆక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు ..అక్టోబర్ 4వ తేదీ వరకూ అరెస్టు చేయవద్దంటూ సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. అయితే సీఐడీ అధికారులు కూడా అదే రోజు విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో విచారణకు హజరు అవుతారా లేక మరో తేదీ కేటాయించాలని కోరతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు క్వాష్ పిటిషన్ పై విచారణ ఆగస్టు ఆరవ తేదీన జరిగే అవకాశం ఉంది. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తి అయిన తర్వాతనే లోకేష్ ఏపీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.

YS Sharmila: వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై తేల్చని కాంగ్రెస్ అధిష్టానం ..కింకర్తవ్యం..?  

Related posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!