NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Sharmila: వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై తేల్చని కాంగ్రెస్ అధిష్టానం ..కింకర్తవ్యం..?  

YS Sharmila: వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ టీపీ విలీనంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంత వరకూ ఏమీ తేల్చలేదు. ఈ నెల 30వ తేదీలోగా విలీనంపై స్పష్టమైన ప్రకటన వెలువడకపోతే సొంతంగా ఎన్నికల బరిలోకి దిగుతామని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటమ్ జారీ చేసిన సంగతి తెలిసిందే. షర్మిల విధించిన డెడ్ లైన్ నేటితో ముగియనుండటంతో విలీనంపై ప్రకటన వస్తుందా..? లేక తెలంగాణలోని మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేస్తారా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

YS Sharmila

వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావం నుండి అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తొంది. కేసిఆర్ సర్కార్ ను రాజకీయంగానే కాక వ్యక్తిగతంగానూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వస్తున్నారు వైఎస్ షర్మిల. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న రీతిలో పోరు నడుస్తుండగా, షర్మిల పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, వైఎస్ఆర్ అభిమానుల ఓట్ల చీలిక ప్రభావం బీఆర్ఎస్ కే లాభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సొంతంగా పోటీ చేసి పట్టుమని పది స్థానాలు కూడా కైవశం చేసుకోలేని పరిస్థితి ఉండటం వల్లనే కాంగ్రెస్ పార్టీలో విలీనానికి షర్మిల మొగ్గుచూపారని టాక్ నడుస్తొంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విషయం తేల్చకపోవడంతో ఆ పార్టీ మీద కోపంతో కేసిఆర్ కు లాభం చేకూర్చేలా అన్ని స్థానాలకు పోటీ చేస్తుందా అనేది కూడా చూడాలి.

YS Sharmila

గత కొద్ది నెలలుగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనంపై వార్తలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశమైయ్యారు. చర్చలు జరిపారు. కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మద్యవర్తిత్వంతో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి అడుగులు వేశారు. షర్మిలకు కర్ణాటక నుండి రాజ్యసభకు పంపుతామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే షర్మిల డిమాండ్ లపై పార్టీ అధిష్టానం ఇంత వరకూ ఏటు తేల్చలేదు. షర్మిల ఢిల్లీకి వెళ్లి మరీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లతో భేటీ అయి చర్చలు జరిపినా కార్యరూపం దాల్చలేదు. షరతుల (డిమాండ్)తో విలీనంపై పార్టీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేయడం లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

షర్మిల సేవలను ఏపీలో వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుండగా, ఆమె తన రాజకీయం తెలంగాణలోనే అని పట్టుబట్టడంతోనే విలీనంపై పీటముడి పడిందని అంటున్నారు. షర్మిల తెలంగాణ కాంగ్రెస్ లో పెత్తనం చేయడాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ససేమిరా అంటున్నారనీ, అందుకే పార్టీ అధిష్టానం నాన్పుడు ధోరణి వ్యవహరిస్తుందనే టాక్ నడుస్తొంది. ప్రస్తుతం అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులో ఉన్న పార్టీ అధిష్టానం షర్మిల పార్టీ విలీనంపై దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకూ షర్మిల పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని తెలుస్తొంది. మరో పక్క షర్మిల పాలేరు నుండి పోటీ చేస్తానని గతంలో ప్రకటించగా, తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం అయితే అక్కడ నుండి పోటీ చేసే అవకాశం ఉండదు.

ఈ పరిణాల నేపథ్యంలో ఇటీవల షర్మిల కీలక ప్రకటన చేశారు. ఈ నెల 30వ తేదీలోపు విలీనంపై కాంగ్రెస్ పార్టీ తేల్చాలి అన్నట్లుగా అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్ లపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించకపోతే ఒంటరిగానే బరిలోకి దిగుతామని షర్మిల తేల్చి చెప్పేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల నుండి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీపీ పోటీ చేసేందుకు సిద్దంగా ఉందని చెప్పడంతో పాటు ఆక్టోబర్ రెండో వారం నుండి ప్రజల మధ్యే ఉండేలా కార్యచరణ చేపడతామని స్పష్టం చేశారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు షర్మిల. పార్టీ విలీనంపై మాట్లాడుతూ తన తాపత్రయం అంతా తెలంగాణ కోసమే.. తెలంగాణ ప్రజల కోసమేనని ఆ రోజు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విధించిన డెడ్ లైన్ నేటితో ముగుస్తున్నందున షర్మిల నుండి ఎటువంటి ప్రకటన వస్తుంది అనే దానిపే సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N