NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Nara Lokesh: మరలా రావాలంటూ లోకేష్ కు సీఐడీ నోటీసులు .. తొలి రోజు విచారణపై లోకేష్ ఏమన్నారంటే..?

Nara Lokesh: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తొలి సారిగా సీఐడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నోటీసులు ఇవ్వడం, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవేళ లోకేష్ మంగళగిరి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం పది గంటల నుండి సాయంత్రం 5 గంటలకు వరకూ లోకేష్ ను సీఐడీ అధికారులు విచారించారు. మధ్యలో గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చిన అధికారులు రింగ్ రోడ్డు స్కామ్ పై పలు ప్రశ్నలు సంధించారు. అయితే విచారణ ఇంకా ముగియలేదని, రేపు కూడా హాజరు కావాలని సీఐడీ అధికారులు తెలిపారు. దాదాపు 50 ప్రశ్నలను సీఐడీ అధికారులు లోకేశ్ కు వేసినట్లు తెలిసింది.

nara lokesh

విచారణకు సహకరించకపోవడంతో తిరిగి రేపు మరో సారి విచారణకు రావాలని సీఐడీ అధికారులు కోరారని అంటున్నారు. తొలి రోజు విచారణ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ .. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు తో సంబంధం లేని 50 ప్రశ్నలు అడిగారన్నారు. ఒకే ప్రశ్న ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం ముందుకు ప్రతిపాదన వచ్చిందా అని అడిగారన్నారు. గూగుల్ లో దొరికే సమాధానాలే తనను అడిగినట్లు చెప్పారు. హెరిటేజ్ కు సంబంధించి 49 ప్రశ్నల వరకూ అడిగారన్నారు.

This file is enough soon Nara Lokesh was arrested

ఇది కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోందని అన్నారు లోకేష్. తాను, చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా ఈ రోజే ఎంత సమయం అయినా ఉంటానని చెప్పినా మళ్లీ రేపు రావాలంటూ 41 ఏ నోటీసు ఇచ్చారని లోకేష్ తెలిపారు. తనకు రేపు వేరే పనులు ఉన్నాయని చెప్పినా రేపు ఉదయం 10 గంటలకు రావాలని చెప్పారనీ,  ఖచ్చితంగా రేపు విచారణకు హజరవుతానని లోకేష్ తెలిపారు.

YS Viveka Case:  వైఎస్ భాస్కరరెడ్డికి సీబీఐ కోర్టులో మరో సారి ఊరట ..  ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపు

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju