NewsOrbit
జాతీయం న్యూస్

Rishi Sunak: భారీ వలసల అడ్డుకట్టకు బ్రిటన్ సర్కార్ కీలక నిర్ణయం .. ఇక వీసాలు కఠినతరం !

Rishi Sunak: విపరీతంగా పెరిగిపోతున్న వలసలను నివారించేందుకు ఉపాధి వీసాను మరింత కఠినతరం చేయాలని బ్రిటన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అత్యధిక వేతనాలు ఉన్న విదేశీ వృత్తి నిపుణులకే వీసాలు ఇవ్వాలని, డిపెండెంట్లుగా వచ్చే భాగస్వాములకు కఠిన నిబంధనలను అమలు చేయాలని బ్రిటన్ సర్కార్ నిశ్చయించింది. బ్రిటన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ను తగ్గించడానికి రాడికల్ యాక్షన్ ప్రకటించింది. ఇందులో భాగంగానే నైపుణయ్ కల్గిన విదేశీయుడు యూకే లో పని చేయడానికి వీసా కావాలనుకుంటే .. కనీస వేతనాన్ని కూడా భారీగా పెంచింది.

గత ఏడాది ప్రభుత్వం జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ వీసాల సంఖ్య 7,45,000. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికంగా కావడం గమనార్హం. పెరిగిన ఇమ్మిగ్రేషన్ వీసాల సంఖ్యను మూడు లక్షల కంటే తక్కువకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ దేశ హోమ్ మినిస్టర్ జేమ్స్ క్లెహెర్లీ తెలిపారు. అంతే కాకుండా కొత్త రాకపోకలను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేసిన బ్రిటన్ ప్రదాని రిషి సునాక్ పై ఒత్తిడి పెరగడం కూడా ఇందుకు ఒక కారణం అని తెలుస్తొంది.

ఇమ్మిగ్రేషన్ చాలా ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడించాయి. దానిని తగ్గించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు, ఇవన్నీ యూకే ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయని రిషి సునాక్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు. దీనికి సంబంధించి బ్రిటన్ హోంమంత్రి సోమవారం హౌస్ ఆఫ్ కామర్స్ లో బిల్లు పెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో పని చేయడానికి వచ్చే వృత్తి నిపుణులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్ తీసుకురాలేరు.

విదేశీ విద్యార్ధులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్ తీసుకుని రావడంపై కూడా నిషేదం ఉంది. అయితే రిసెర్చ్ డిగ్రీలు చేసే పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు ఇందులో నుండి మినహాయింపు ఉంటుంది. బ్రిటన్ లో వృత్తి నిపుణుల వీసా పొందడానికి గతంలో ఏడాదికి 26,200 పౌండ్ల వేతనం ఉంటే సరిపోతుంది. కొత్త నిబంధనల ప్రకారం..ఆ వేతనం 38,700 పౌండ్లు ఉండాలి. గతంలో కుటుంబ వీసా కోసం 18,600 పౌండ్ల వేతనం ఉంటే సరిపోయేది. దానినీ 38,700 పౌండ్లకు ప్రభుత్వం సవరించింది. భవిష్యత్తులో విద్యార్ధి వీసాలపైనా ఆంక్షలను అమలు చేయనున్నట్లు మంత్రి క్లెవర్లీ వెల్లడించారు.

గతంలో యూరోపియన్ యూనియన్ దేశాల వారు ఎక్కువగా బ్రిటన్ దేశానికి వలసలు వచ్చే వారు. అయితే ఈ మధ్య కాలంలో ఇండియా, నైజీరియా, చైనా నుంచి బ్రిటన్ వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని సమాచారం.

Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి .. ప్రమాణ స్వీకారం మూహూర్తం ఖరారు చేసిన అధిష్టానం

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?