NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

ap government cm ys jagan decision for salary hike to volunteers

YS Jagan: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పని చేస్తున్న వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వాలంటీర్లకు బహుమానం ప్రకటిస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 1 నుండి వాలంటీర్లకు గౌరవ భృతి రూ.5 వేల నుండి రూ.5,750కి పెంచుతున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారనీ, అందుకే రాష్ట్రంలో జగన్ పాలన పోవాలని అంటున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు.

ప్రతిపక్ష నేతలు అడ్డుపడుతున్నా మరో సారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు మంత్రి కారుమూరి. రాష్ట్రంలోని వాలంటీర్లు ఇకపై వారి పరిధిలోని లబ్దిదారులు అందరికీ ఎండియుల ద్వారా రేషన్ పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. వాలంటీర్లకు పెరిగిన గౌరవ వేతనం జనవరి నుండి ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద వర్గాలకు నేరుగా అందించేందు గానూ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో  50 నుండి 75 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకూ రూ.5వేల గౌరవ వేతనంతో వీరు విధులను నిర్వహిస్తున్నారు.

Dinosaur Eggs: మధ్యప్రదేశ్ లో వండర్ .. కులదేవతగా డైనోసార్ గుడ్లకు పూజలు

Related posts

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju