NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RK Roja: డప్పుకొట్టిన మంత్రి రోజా

RK Roja: ఏపీ పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి మంత్రి ఆర్కే రోజా ఇవేళ డప్పు కొట్టి కళాకారులను ఉత్తేజపరిచారు. రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి (భాషా సంస్కృతిక శాఖ) ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ రంగాల కళాకారులు పాల్గొనగా, ముఖ్య అతిధిగా హజరైన మంత్రి ఆర్కే రోజా కొద్దిసేపు డప్పు కొట్టి నవ్వులు పూయించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. సాంస్కృతిక సంబరాల్లో కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. తోటి కళాకారులందరికీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఓ మంత్రిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

నవరత్నాలు పథకాల ద్వారా కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేకూర్చిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదనీ, గుర్తింపు కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు.  కళాకారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వం పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కళాకారులే బాధ్యతగా తిప్పికొట్టాలని మంత్రి రోజా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో  విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ భాగ్యలక్ష్మి, రాష్ట్ర సృతనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ ఎల్ జోగినాయుడు, సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష, దృశ్య కళల అకాడమి చైర్ పర్సన్ కే సత్య శైలజ, సాహిత్య అకాడమి చైర్ పర్సన్ శ్రీలక్ష్మి, సంగీత నృత్య కళల అకాడమి చైర్ పర్సన్ పి శిరీష. సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమి చైర్ పర్సన్ టి ప్రభావతి, అధికార భాషా సంఘం సభ్యుడు మస్తానమ్మ, రాష్ట్ర సంస్కృతిక శాఖ సీఈఓ మల్లికార్జునరావు పాల్గొన్నారు.

AP Politics: అన్నా- చెల్లి, మరిది – వదిన – ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామం

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N