NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Ayodhya Ram Mandir: అయోధ్యలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం

Ayodhya Ram Mandir: అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యాపురిలోని భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బలరాముడు కొలువుతీరిన వేళ యావత్ భారతం పులకించిపోయింది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్ని అంటింది.
అయోధ్య రామ మందిరంలో స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ మహోన్నత ఘట్టాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా (టీవీ ప్రత్యక్ష ప్రసారం) కోట్లాది మంది భారతీయులు వీక్షించి తన్మయత్వం పొందారు.

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోడీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామ్ లల్లా విగ్రహం వద్ద పూజలు చేసారు. 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ పాల్గొన్నారు. మరో పక్క రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరం మొత్తం అధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మారుమోగింది. నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి సుమారు ఏడు వేల మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించి తరించారు.

ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని 114 కుండలతో వివిధ తీర్థ స్థలాల నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో స్నానం  చేయిస్తారు. అనంతరం అయోధ్య రామ మందిరంలో సామాన్య ప్రజల కోసం తెరుస్తారు.

Rahul Gandhi: ఆలయ ప్రవేశానికి అనుమతి నిరాకరణ .. నిరసన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ

Related posts

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N