NewsOrbit
Cricket ట్రెండింగ్ న్యూస్

Dean Elgar – Virat Kohli: కోహ్లీ అంత నీచమైన పని చేశాడా ..? 2015 నాటి సంచలన ఘటనను వెల్లడించి డీన్ ఎల్గార్

Dean Elgar – Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్ కు ఇటీవలే వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గార్ సంచలన విషయాలను వెల్లడించారు. ‘బాంటర్ విత్ బాయ్స్’ అనే ఈ పొడ్ కాస్ట్ కు హజరైన డీన్ ఎల్గార్ మాట్లాడుతూ .. టీమిండియా ఆటగాడు కోహ్లీ తనపై ఉమ్మేశాడని సంచలన విషయాన్ని వెల్లడించారు.

2015 లో మొహాలీ వేదికగా ఓ టెస్ట్ లో తాను బ్యాటింగ్ కు దిగాననీ, అప్పుడే మొదటి సారి కోహ్లీని మొదటి సారిగా ప్రత్యక్షంగా చూసినట్లు డీన్ ఎల్గార్ చెప్పారు. అక్కడి పిచ్ చూస్తే ఓ జోక్ లా అనిపించిందనీ, అలాంటి పిచ్ పై బ్యాటింగ్ ఓ సవాల్ గా నిలిచిందన్నారు. అప్పుడు బ్యాటింగ్ చేస్తున్న తనపై అశ్విన్, జడేజా మాటల తూటాలు విసిరితే తాను కూడా వారికి ధీటుగా జవాబు చెప్పానన్నారు.

ఆ సమయంలో కొహ్లీ మధ్యలో వచ్చి తనపై ఉమ్మేశాడని, దాంతో తాను ఓ బూతు మాట ఉపయోగించి, బ్యాట్ తో కొడతానంటూ కొహ్లీని హెచ్చరించానన్నారు. అప్పటికి కొహ్లీ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరుకు ఆడుతున్నాడన్నారు. ఆ జట్టులోనే దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ కూడా ఉన్నారనీ, అందు వల్ల దక్షిణాఫ్రికా యాస గురించి, తాను వాడిన బూతు మాట గురించి కొహ్లీకి అవగాహన ఉంటుందనే తాను అనుకున్నానన్నారు. తాను మాట అనగానే కొహ్లీ కూడా అదే బూతు మాటను ఉచ్చరిస్తూ హేళన చేయడం మొదలు పెట్టాడనీ, దాంతో తాను వీడితో పెట్టుకోవడం అనవసరం అనిపించి వదిలివేశానన్నారు.

ఆ తర్వాత 2017 -18 సీజన్ లో దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వచ్చిందన్నారు. అప్పుడు కోహ్లీ తన వద్దకు వచ్చి గతంలో అప్పట్లో జరిగిన ఘటనపై క్షమాపణలు చెప్పి సిరీస్ ముగిసిన తర్వాత పార్టీ చేసుకుందామని ఆహ్వానించాడన్నారు. కోహ్లీ ఆహ్వానాన్ని అంగీకరించి ఆ సిరీస్ ముగిసిన తర్వాత ఇద్దరం పార్టీ చేసుకున్నామంటూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

కాగా, ఎల్గార్ కేరీర్ లో ఇటీవల చివరి టెస్ట్ అడింది టీమిండియాపైనే. ఎల్గార్ చివరి ఇన్నింగ్ ఆడగానే కోహ్లీ అతన్ని ఆత్మీయంగా హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య వివాదం సమసిపోయి స్నేహంగా ఉన్నా దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కోహ్లీ చేసిన పని వెల్లడించడం హాట్ టాపిక్ అయ్యింది.

TTD: రూ.5వేల కోట్లు దాటిన టీడీపీ వార్షిక బడ్జెట్

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?