NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ప్రకాశం వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైన కీలక నేత.. త్వరలో బీజేపీలోకి..?

YSRCP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వలసల పర్వం కొనసాగుతోంది. అధికార వైసీపీ ఇప్పటికే లోక్ సభ, అసెంబ్లీ ఇన్ చార్జిల మార్పులు చేర్పుల కసరత్తు కొనసాగిస్తూ ఆరు జాబితాలు విడుదల చేసింది. దాదాపు 70కిపైగా అసెంబ్లీ, డజను ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్ధులను వైసీపీ ఖరారు చేసింది.

ఈ క్రమంలో అధికార పార్టీలో సీటు దక్కని నేతలు, ఆశావహులు వరుసగా పార్టీని వీడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే విపక్షాల తీర్ధం పుచ్చుకోగా, మరి కొందరు అదే బాట పట్టేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చెందిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పార్టీ వీడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఆయన త్వరలో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారని సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో డాక్టర్ ఏలూరి భేటీ కావడంతో ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది. పురందేశ్వరితో జరిగిన సమావేశంలో  జిల్లాలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తొంది. ఆయన రేపో మాపో వైసీపీకి రాజీనామా చేసి బీజేపీ చేరతారని అంటున్నారు.

డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మార్కాపురం నుండి పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వెలిగొండ ప్రాజెక్టు కోసం ఉద్యమం కూడా చేశారు. ప్రస్తుతం వైసీపీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నాగార్జునరెడ్డిపై నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి టికెట్ ఆశించారు.

అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గిద్దలూరు పార్టీ ఇన్ చార్జిగా నియమించి, అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించడంతో పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరుతుందన్న వార్తల నేపథ్యంలో డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి జాతీయ పార్టీ బీజేపీలో చేరాలని భావిస్తున్నారని అంటున్నారు.

Rajasthan Gang Rape: రాజస్థాన్ లో దారుణ ఘటన ..అంగన్ వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని 23 మంది మహిళలపై గ్యాంగ్ రేప్ !

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!