NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari February 12 2024 Episode 391: ముకుందా, మురారి కలిసున్న ఫోటో చూసేసిన ఆదర్శ్.. ఈసారి శాశ్వతంగా దూరం కానున్నాడా.?

Krishna Mukunda Murari Today Episode February 12 2024 Episode 391 Highlights

Krishna Mukunda Murari February 12 2024 Episode 391:  ఇంట్లో వాళ్ళందరూ భోజనానికి తినడానికి వస్తారు. అప్పుడు మురారి , ఆదర్శ్ ఇద్దరు మందు తాగేసి వచ్చారని వాళ్ళ వాళ్ళకం చూస్తే అర్థమయిపోతుంది నందిని ఆదర్శ్ మురారిల వైపు చూస్తూ మీరిద్దరూ మందు తాగి వచ్చారు కదా అని అడుగుతుంది. లేదు లేదు లేదు అని మురారి కవర్ చేస్తాడు అయితే బయటకి గాలి వదలండి అని కృష్ణ అంటుంది. ఏంటి నువ్వే ఈ ఏసిపి నీ టెస్ట్ చేస్తున్నావా అని మురారి అడుగుతాడు. మురారి గాలి బయటకు పిలుచు అని నందిని అంటుంది. కానీ మురారి గాలిని మాత్రం లోపలికి పిలుస్తాడు. ఏసీబీ సరిగ్గా గాలిని బయటకు పిలిచండి అని కృష్ణ అంటుంది మీరు సరిగ్గా గాలి బయటకు పిలుస్తారా లేదంటే దగ్గరకు వెళ్లాలా అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 12 2024 Episode 391 Highlights
Krishna Mukunda Murari Today Episode February 12 2024 Episode 391 Highlights

అప్పుడు రేవతి ఈ విష.యాన్ని మీరు మీరు చూసుకోండి అంతేగాని అక్క దగ్గరికి తీసుకెళ్లకండి. అసలు అక్క బాగోలేదని పడుకుంది. తనకి ఇంకాస్త తలనొప్పి ఎక్కువ అవుతుంది అని రేవతి అంటుంది ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అవును రేపటి కాంపిటీషన్ కి కాన్సెప్ట్ రెడీ చేశారా అని నందిని కృష్ణ ని అడుగుతుంది. సూపర్ కాన్సెప్ట్ ని డిజైన్ చేశాను ఈ కాన్సెప్ట్ లో కచ్చితంగా ముకుంద ఆదర్శ గెలుస్తారు అని కృష్ణ అంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్పమని ముకుందా అడుగుతుంది ముందుగా చెప్పేస్తే ఎలాగా అస్సలు చెప్పను సర్ప్రైజ్ ఉండాలి కదా అని కృష్ణ అంటుంది. ఇప్పటికే ఉన్న తలనొప్పులు చాలు అంటే మళ్ళీ ఇదొకటే అని ముకుందా మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 12 2024 Episode 391 Highlights
Krishna Mukunda Murari Today Episode February 12 2024 Episode 391 Highlights

ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా మధు అక్కడికి వస్తాడు. అందరూ ఒక్కచోట భలే కూర్చున్నారే సూపర్ సిట్యుయేషన్. కానీ ఎవరు ఫోన్లో వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు అని మధు సెటైరికల్ గా మాట్లాడుతాడు. అవును ఆదర్శ్ నువ్వు నీ ఫోన్ ని ముకుంద కి ఇస్తావా ముకుంద ఫోన్ నీకు ఇస్తుందా అని మధు ఆదర్శ్ ని ప్రశ్నిస్తాడు. అప్పుడే మురారి అక్కడికి వచ్చి నమ్మకం ఉన్న వాళ్ళు ఒకరి ఫోన్ ఒకరికి ఇవ్వనవసరం లేదు అని మురారి చెబుతాడు. అంతలో కృష్ణ అక్కడికి వస్తుంది సూపర్ చెప్పారు ఏసీబీ సార్ అని అనుకుంటుంది. ముకుందా మాత్రం మనసులో ఎవరినైనా నమ్మించొచ్చు కానీ, ఈ మధుని నమ్మించడం చాలా కష్టం పెద్దతయ్య దగ్గరైన నేను చెప్పే మాటలు చెబుతావేమో గాని మధు దగ్గర నేను వేసే వేషాలు చల్లవు అని ముకుందా మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 12 2024 Episode 391 Highlights
Krishna Mukunda Murari Today Episode February 12 2024 Episode 391 Highlights

అవును బ్రో. మీలో ఒక్కరైనా మీ భార్యలకు వాలెంటైన్స్ డే రోజు ప్రపోజ్ చేశారా అని మళ్లీ మధు అంటాడు అందరి ముందు ప్రపోజ్ చేసుకుంటారు. పర్సనల్ గా చెప్పుకొని ఉండుంటారు. అందరి ముందు ప్రపోజ్ చేస్తారు కదా అందుకే అడిగాను అని మధు అంటాడు. సరిగ్గా అదే టైంలో కృష్ణ తన చేతికి ఉన్న రింగు చూసుకుంటుంది. అప్పుడు అది కనిపించదు తన చేతికి ఉన్న రింగు పోయిందని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ బయట ఎక్కడైనా పడిందేమోనని బ్రతకమని ఇంట్లో వాళ్ళందరూ చెబుతారు. మధు వంటగదిలోకి వెళ్తాడు కృష్ణ పైన బెడ్ రూమ్ లోకి వెళ్లి కూడా వెతుకుతుంది కానీ, ఎక్కడా ఆ రింగ్ కనిపించదు ఏంటి కృష్ణ అన్నయ్య నీకు ఎంతో ప్రేమగా వాలెంటైన్స్ డే రోజు జరిగిన రింగుని అంత ఈజీగా చేజార్చుకుంటే ఎలాగా పైగా వాలెంటైన్స్ డే రోజే ఆ రంగును పోగొట్టుకుంటే ఎలాగా అని నందిని అంటుండగా.. ఏంటి నందు నువ్వు కూడా అసలే రింగిపోయిందని బాధలో ఉంటే నువ్వు మళ్ళీ ఇలాంటి సెంటిమెంట్లు జోడిస్తే తను ఇంకాస్త బాధపడుతుంది కదా అని మురారి అంటాడు‌. అప్పుడు ముకుందా మనసులో ఆ రింగ్ ని నేనే కృష్ణకు తొడగమని ఇచ్చాను కదా అంటే.. ఇప్పుడు ఆ రింగు పోయింది అంటే మురారి మనసులో నాకు స్థానం ఉందని ఇదొక సిగ్నల్ ఆ కృష్ణ వెళ్లిపోతుంది ఆ ప్లేస్ నాకే దక్కుతుంది అని ఇది ఒక సూచనలా భావించా అని ముకుందా మనసులో అనుకుంటుంది. అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటుంది. నేను కృష్ణకి అన్యాయం చేయకూడదు అని ముకుందా మనసులో అనుకుంటుంది. అయినా నువ్వు ఏంటి కృష్ణ నీకు ఆ రింగ్ కావాలంటే మళ్ళి ఇలాంటిదే నేను ఇంకొకటి కొని ఇస్తాను అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode February 12 2024 Episode 391 Highlights
Krishna Mukunda Murari Today Episode February 12 2024 Episode 391 Highlights

సార్ డెకరేషన్ చేయడానికి రమ్మని చెప్పారంట అని డెకరేషన్ వాళ్ళు వచ్చి మురారిని అడుగుతారు. అవును మీకోసమే ఎదురుచూస్తున్నాం. ఏంటి ఇంత లేట్ అయింది రండి సాయంత్రం వాలెంటైన్ డే కి కావలసిన డెకరేషన్ మొత్తం మీరు గ్రాండ్గా రెడీ చేయండి అని చెబుతారు. రెడీ చేస్తూ ఉండగా సార్ స్టిక్కర్లు తీసుకురావడం మర్చిపోయాను కొంచెం అవి అరేంజ్ చేస్తారా అని మురారిని అడుగుతారు. అప్పుడే తన పక్కనే ఉన్న ఆదర్శ్ ని పిలిచి కొంచెం అవి పాత కబోర్డ్ లో ఉన్నవి తీసుకువస్తావ అని మురారి ఆదర్శ్ తో అంటాడు. సరే అని ఆదర్శ్ తీసుకురావడానికి గదిలోకి వెళ్తాడు. ఇక ఇదే ఛాన్స్ అనుకోని ముకుందా మురారితో ఫోటో దిగాలని అనుకుంటుంది. మురారి చూడకుండా తనతో కలిసి సెల్ఫీ దిగుతుంది.

Krishna Mukunda Murari Today Episode February 12 2024 Episode 391 Highlights
Krishna Mukunda Murari Today Episode February 12 2024 Episode 391 Highlights

మరోవైపు ఆదర్శ్ స్టిక్కర్ కోసం అని ఆ పాత రాక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ముకుందా మురారి కలిసి ఉన్న ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో పక్కనే ఆదర్శ్ మురారి కలిసున్న ఫోటో ఉంటుంది. అది ముకుందా ఫోల్డ్ చేసి ఉంచుతుంది. ఎందుకు ముకుందా? కావాలని నా ఫోటోని ఫోల్డ్ చేసి పెట్టింది అని మురారి ఆదర్శ్ అనుకుంటాడు. ఆదర్శ్ ఇప్పుడు ఆ ఫోటోలను చూస్తే ఇంకేమైనా ఉందా అని ముకుందా గబగబా పరుగెత్తుకు వెళ్తుంది.. ఆదర్శ్ ఆ ఫోటోలను చూసేసాడు కాబట్టి ఇక ముకుంద ఆదర్శ ను ఏ విధంగా డైవర్ట్ చేస్తుంది. మరోసారి ముకుందపై ఆదర్శకు అనుమానం వచ్చి నిజంగానే ఈసారి శాశ్వతంగా దూరమైపోతాడా అనేది చూడాలి.

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella