NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నీతులు చెప్పి గోతిలో ప‌డ్డ చంద్ర‌బాబు…!

నీతులు చెప్పేవారే ఒక్కొక్క‌సారి గోతుల్లో ప‌డుతుంటారు. సుదీర్ఘ అనుభ‌వం ఉంద‌ని చెబుతున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. తాజాగా చేసిన ప‌ని రాజ‌కీయంగా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. అదే స‌మ‌యంలో టీడీపీ లోనూ చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇది స‌రికాదేమో.. బాబూ అంటూ త‌మ్ముళ్లు సైతం పెదవి విరుస్తున్నారు. `ఒక చోట ప‌నికిరాని చెత్త మ‌రో చోట బంగారం అవుతుందా?` అని వైసీపీ ఎమ్మెల్యేల మార్పుల‌ను ప్ర‌స్తావించి చంద్ర‌బాబు చేసిన విమ‌ర్శ ఇది.

స‌రే.. వైసీపీ వాళ్ల ఇంట‌ర్న‌ల్ వ్య‌వ‌హారం అయినా.. బాబు కామెంట్లు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను డైల్యూట్ చేయాల‌న్న రాజ‌కీయ వ్యూహంలో భాగంగా చంద్ర‌బాబు అలా చేశార‌ని అనుకుందాం. మ‌రి ఇదే చెత్త‌ను చంద్ర‌బాబు త‌న పార్టీలోకి చేర్చుకుంటున్నారు. వైసీపీ కాద‌ని.. వ‌దిలేసిన‌, లేదా ప‌క్క‌న పెట్టిన‌.. లేదా ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి మార్చిన వారు వ‌స్తామంటే.. వెంట‌నే చంద్ర‌బా బు కండువా క‌ప్పేస్తున్నారు.

పోనీ.. ఇది కూడా రాజ‌కీయ వ్యూహంగానే అనుకుందాం. నాయ‌కుల్లో ఉన్న బ‌లాన్ని, స‌త్తువ‌ను వైసీపీ క‌నిపెట్ట‌లేక పోయింది. తాను క‌నిపెట్టాను. వారు గెలుపు గుర్రాలు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో వారు క‌రెక్టే.. అని చంద్ర‌బాబు తీర్మానం చేసుకుని వారిని తీసుకుని ఉండ‌వ‌చ్చు. దీనిని కూడా ఎవ‌రూ త‌ప్పుప‌ట్టా ల్సిన అవ‌స‌రం లేదు. కానీ, ఎటొచ్చీ.. అస‌లు పార్టీలోనే చేర‌కుండా.. ఉన్న వారికి అత్యుత్సాహంగా సీట్లు ఇవ్వ‌డం.. పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం క‌ల్పించ‌డం వంటివి.. చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి.

తాజాగా పెన‌మ‌లూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌థిని నూజివీడు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంచార్జ్‌గా నియ మిస్తూ.. చంద్ర‌బాబు ఆదేశాల‌తో రాష్ట్ర పార్టీ చీఫ్ అచ్చెన్నాయుడు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అంతే కాదు.. ఈ ఆదేశాలు త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని అన్నారు. కానీ, చిత్రం ఏంటంటే.. కొలుసు పార్థ‌సార‌థి .. ఇంకా వైసీపీకి రాజీనామా చేయ‌లేదు. ఆయ‌న ఇంకా వైసీపీ స‌భ్యుడిగానే ఉన్నారు. పోనీ.. పార్టీకి రాజీనామా చేస్తాన‌ని కూడా ఎక్క‌డా బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌లేదు.

కానీ, ఇంత‌లోనే ఇలా.. అచ్చెన్నాయుడి సంత‌కంతో ప్ర‌క‌ట‌న రావడంపై త‌మ్ముళ్లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌వేళ ఇంత‌లోనే సీఎం జ‌గ‌న్ మ‌న‌సు మార్చుకుని.. కొలుసును బుజ్జ‌గిస్తే.. మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెబితే.. ఆయన తిరిగి వైసీపీలోనే ఉండిపోతారు.. జ‌గ‌న్‌కే జై కొట్టినా ఆశ్చ‌ర్యం లేదు. తాజాగా ఆళ్ల ప‌రిస్థితే ఉదాహ‌ర‌ణ‌. మ‌రి ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా.. ఇంకా.. కండువా కూడా క‌ప్పుకోని కొలుసును ఇంచార్జ్‌గా నియ‌మించ‌డం సరికాద‌ని అంటున్నారు.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!