Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన “RRR” 2022 మార్చి నెలలో విడుదల అయింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఏకంగా వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో “RRR” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. బాహుబలి కంటే “RRR” తోనే రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది. ఇదిలా ఉంటే చరణ్ సినిమా రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు అయిపోయింది. ప్రస్తుతం “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఏడాదిన్నర నుండి జరుగుతూనే ఉంది. ఇప్పటికి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అధికారిక ప్రకటన చేయలేదు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ అనేకమార్లు వాయిదా పడింది. “RRR” లాంటి పెద్ద హిట్ సినిమా తర్వాత.. దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ రావటం మెగా అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో చరణ్ ఒకపక్క “గేమ్ చేంజర్” చేస్తూనే ఇప్పుడు మరో సినిమా షూటింగ్ సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి రెడీ కావడం జరిగిందట. ఆ సినిమా మరేదో కాదు బుచ్చిబాబుతో చేయబోతున్న ప్రాజెక్ట్. “ఉప్పెన” సినిమాతో మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన బుచ్చిబాబు తన రెండో సినిమా చరణ్ తో చేయబోతున్నారు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఈనెల 20వ తారీకు అధికారికంగా ప్రారంభం కాబోతుందట. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని బుచ్చిబాబు తీయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన బాడీ షేప్ కూడా మార్చుకోవడానికి వర్కౌట్స్ చేయటం జరిగింది అంట.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!