NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Supreme Court: తమిళనాడు గవర్నర్ రవి తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు ..

Supreme Court: తమిళనాడు గవర్నర్ రవి తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్  నిరాకరించడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పొన్ముడికి హైకోర్టు విధించిన శిక్షను ఇటీవల సుప్రీం కోర్టు సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయనను మంత్రి వర్గంలో తీసుకోవాలని సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు.

అయితే పొన్ముడి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి తమిళనాడు గవర్నర్ రవి నిరాకరించారు. పొన్ముడి శిక్షపై సుప్రీం కోర్టు స్టే మాత్రమే విధించిందనీ, పూర్తిగా కేసు కొట్టేయలేదని చెబుతూ గవర్నర్ రవి ..స్టాలిన్ సర్కార్ నిర్ణయాన్ని తిరస్కరించారు.

గవర్నర్ నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, సుప్రీం కోర్టు ఇవేళ విచారణ జరిపింది. గవర్నర్ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధర్మాసనం మండిపడింది. ఈ నెల 22వ తేదీలో పొన్ముడి చేత ప్రమాణ స్వీకారం చేయాలని తమిళనాడు గవర్నర్ కు సుప్రీం కోర్టు గడువు విధించింది.

కాగా, పొన్ముడి 2006 నుండి 2011 వరకూ విద్య, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 లో పొన్ముడి, ఆయన భార్య పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసు నమోదైంది. ఈ కేసులో పొన్ముడిని దోషిగా నిర్ధారించిన ట్రయల్ కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై పొన్ముడి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ చుక్కెదురైంది.

అయితే సుప్రీం కోర్టులో ఆయనకు ఊరట లభించింది. దిగువ కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో పొన్ముడి శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్దరించినట్లు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ తెలిపారు. దీంతో పొన్ముడిని తిరిగి మంత్రిగా నియమించాలని గవర్నర్ ను కోరారు. కానీ గవర్నర్ దాన్ని నిరాకరించడంతో వివాదం చెలరేగింది.

AP High Court: ఏపీపీఎస్‌సీ గ్రూప్ -1 పరీక్ష రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలు

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju