NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili March 26 2024 Episode 607: గౌతమ్ చేత నీలిమ ని కొట్టిస్తానంటున్న బన్నీ వాళ్ళ నాన్న..

Malli Nindu Jabili Today Episode March 26 2024 Episode 607 highlights

Malli Nindu Jabili March 26 2024 Episode 607:  మాలిని ని మల్లి తీసుకొచ్చి వసుంధర కి ఎదురుగా నిలబెడుతుంది. ఈవిడేనా మా కోడలు మా కోడలు చాలా బాగుంది మాకు నచ్చింది అని వాళ్ళ వియ్యపురాలు అంటుంది. చూసావా అక్క గుళ్లో ఏం జరుగుతుందో నీకు తెలియకుండా అని మల్లి అంటుంది. నువ్విక్కడికెందుకొచ్చావే? నువ్వేమైనా చెప్పవా శంకరమ్మ అని అడుగుతుంది వసుందర. నేను చెప్పలేదు అమ్మ అని శంకరమ్మ అంటుంది. మీరేమైనా చెప్పారా అని శరత్ ని అడుగుతుంది వసుంధర. నేను చెప్పలేదు అని శరత్ అనడంతో వసుంధర సైలెంట్ గా ఉంటుంది. మామ్ ఎన్నిసార్లు చెప్పాను నాకు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని అని మాలిని అంటుంది. మాలిని ఏది చేసినా నీ మంచి కోరే చేస్తాను అని వసుంధర అంటుంది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఎందుకు చేసావు మామ్ అంటూ మాలిని వెళ్ళిపోతుంది.

Malli Nindu Jabili Today Episode March 26 2024 Episode 607 highlights
Malli Nindu Jabili Today Episode March 26 2024 Episode 607 highlights

నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా ఇక వెళ్ళు అని వసుంధర అంటుంది. నా అక్కకి అన్యాయం జరగనివ్వను అరవింద్ బాబు గారు వస్తారు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని మల్లి అంటుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని వసుంధర ని శరత్ కోపంగా అంటాడు. ఇంకా ఏమీ మాట్లాడకండి అని వసుంధర అంటుంది. మాట్లాడకుండా ఉండడానికి నేనేమన్నా కొంగుచాటు మొగుడిని అనుకున్నావా నీ భర్తని  వసుందర ఇక చేసింది చాలు పద అని తీసుకొని వెళ్ళిపోతాడు శరత్. దేవుడా అరవింద్ బాబు గారు మాలిని అక్క కళ్ళ ముందుకు వచ్చే అంతవరకు తన జీవితంలోకి మూడో వ్యక్తిని రానివ్వకు అని మల్లి దండం పెట్టుకుంటుంది. కట్ చేస్తే, నీకేం  ధైర్యం ఉంటే అమ్మాయిని తీసుకొని రైస్ మిల్లు లోకి వస్తావు రా దానికి ఫోన్ చేసి ఇక్కడికి రప్పించు అని బన్నీ వాళ్ళ నాన్న అంటాడు.

Malli Nindu Jabili Today Episode March 26 2024 Episode 607 highlights
Malli Nindu Jabili Today Episode March 26 2024 Episode 607 highlights

నాన్న ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి రాదు తను చాలా మంచిది ఎందుకు నాన్న అలా అంటున్నావ్ అని బన్నీ అంటాడు. రేయ్ డబ్బున్న వాళ్ళని చూసి పేద పిల్లలు లవ్ లో పడేసుకొని డబ్బు లాక్కొని మోసం చేసి వెళ్ళిపోతున్నారా అ0దులో నువ్వు కూడా ఒకడివి అయ్యావు అని వాళ్ళ నాన్న అంటాడు. నాన్న ఆమె అలాంటిది కాదు తన గురించి తప్పుగా మాట్లాడకు అని బన్నీ అంటాడు. సార్ మీ అబ్బాయి ఆ అమ్మాయిని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నట్టున్నాడు వదిలేయండి సార్ అని గౌతమ్ అంటాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేయరా వెంటనే రమ్మని చెప్పు అని వాళ్ళ నాన్న కోపంగా అనడంతో బన్నీ నీలిమా కి ఫోన్ చేసి రైస్ మిల్ దగ్గరికి రమ్మని చెబుతాడు. బన్నీ ఈ విషయం మా ఇంట్లో అమ్మ కూడా తెలిసిపోయింది నన్ను రానివ్వదు అని నీలిమా అంటుంది. ఏదో ఒక రకంగా బయటికి రా బన్నీ అనడంతో నీలిమ వాళ్ళ అమ్మ నుంచి తప్పించుకొని వస్తుంది.కట్ చేస్తే,అరవింద్ నువ్వేనా అమ్మకి చెప్పు  మరొకరిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని మాలిని అరవింద్ ఫోటోకి దీపారాధన చేస్తూ మాట్లాడుతుంది.

Malli Nindu Jabili Today Episode March 26 2024 Episode 607 highlights
Malli Nindu Jabili Today Episode March 26 2024 Episode 607 highlights

మాలిని అరవింద్ నీ జీవితంలో కొండెక్కిన దీపం లాంటివాడు ఉదయంచే సూర్యుడు అస్తమించాడు రాత్రి కి వచ్చే వెన్నెల లాంటి ఒక చంద్రుని నీ జీవితంలోకి ఆహ్వానించు అని వసుంధర అంటుంది. అందుకు నా మనసుని సిద్ధంగా చేసుకోలేకపోతున్నాను  జీవితాంతం అరవింద్ జ్ఞాపకాలతోటే బ్రతికేస్తాను అని మాలిని అంటుంది. అరవింద్ నువ్వు నా కూతుర్ని బాగా చూసుకోవట్లేదని కోప్పడనే కానీ ఎప్పుడూ ఇలా నువ్వు చనిపోవాలని కోరుకోలేదు నా కూతురు జీవితం ఇలా అయిపోకూడదు నువ్వైనా తన మనసు మార్చి తను రెండు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేలా చెయ్యి ఈ తల్లి మనసును అర్థం చేసుకునే లా చేయి అని వసుంధర అంటుంది. అరవింద్ లేనప్పుడే నాకు తన జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తొస్తున్నాయి మామ్. నేను తనని మర్చిపోవడం జరగదు నువ్వు పెళ్లి విషయం మర్చిపో అంటూ మాలిని వెళ్ళిపోతుంది.

Malli Nindu Jabili Today Episode March 26 2024 Episode 607 highlights
Malli Nindu Jabili Today Episode March 26 2024 Episode 607 highlights

చూసావా వసుంధర నీ కూతురు ఎంత బాధ పడుతుందో తన గాయాన్ని మానుపుతున్నట్టు లేదు గాయం మీద ఇంకో గాయం చేస్తున్నట్టుంది ఈ పెళ్లి గురించి కొన్నాళ్లు మర్చిపోతే మంచిది అంటూ శరత్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, రేయ్ ఏదిరా  ఇంకా రాలేదు ఈ పని వాళ్ళ ముందే ఈ గౌతమ్ చేత కొట్టిస్తాను అప్పుడేనా దానికి బుద్ధి వస్తుంది అని బన్నీ వాళ్ళ నాన్న అంటాడు. నాన్న ఆ అమ్మాయి గురించి అలా తప్పుగా మాట్లాడకండి తను చాలా మంచిది ఒక ఆడపిల్ల గురించి అలా సంస్కారం లేకుండా మాట్లాడుతారు ఏంటి అని బన్నీ అంటాడు. ఏంట్రా దానికి మర్యాద ఇచ్చేది నాకన్నా అదే ఎక్కువ అయిపోయిందా నీకు అది రాని రా ఈ గౌతమ్ చేతనే దాన్ని ఈ పని వాళ్ళ ముందు కొట్టించినట్టు కొట్టిస్తాను అని అతను అంటాడు. సార్ ఒక అమ్మాయి గురించి అలా తప్పుగా మాట్లాడకండి తప్పు ఆ అమ్మాయి ఒక్కదాన్నే కాదు మి వాడు కూడా తప్పు చేశాడు ఇద్దరు సైడు తప్పుంది సార్ ఎందుకు అమ్మాయిని తిడతారు అలా ఆడపిల్లని కొట్టడం తప్పు సార్ మీ కుటుంబ విషయంలో మేము జోక్యం చేసుకోకూడదు మేం వెళ్తున్నాం అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode March 26 2024 Episode 607 highlights
Malli Nindu Jabili Today Episode March 26 2024 Episode 607 highlights

ఏంటయ్యా గౌతమ్ నాకే నీతులు చెప్తున్నావా వీళ్ళందరూ వెళ్లి మూటలు మోస్తారు నువ్వు మాత్రం ఇక్కడే ఉండు ఆ అమ్మాయి రాగానే నువ్వే కొట్టాలి లేదంటే నిన్ను ఈ పనిలో నుంచి తీసేస్తాను అని అతను అంటాడు. ఆ అమ్మాయిని చూస్తే గౌతమ్ గారు కొట్టలేరు నాన్న తనకు ఒక చెల్లి ఉంది కదా అని బన్నీ అంటాడు. తనకు ఒక చెల్లి ఉంది రా కాదనడం లేదు కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి గౌతమ్ చెల్లెలు కాదు కదా అని వాళ్ళ నాన్న అంటాడు. కట్ చేస్తే, నీలిమ కనిపించట్లేదని అని వాళ్ళ అమ్మ రూమ్ అంతా వెతుకుతుంది.ఒకవేళ నేను బయటికి వెళ్ళనివ్వట్లేదని తను ప్రేమించిన వాడితో ఎక్కడికైనా పారిపోయిందా అని టెన్షన్ పడుతుంది కౌసల్య. నీలిమ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉండగా మల్లి ఎదురవుతుంది. మల్లి చూసి షాక్ అవుతుంది నీలిమ.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella