కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన ఇంటికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే చెన్నై శాలిగ్రామంలోని విజయ్ ఇంట్లో బాంబు ఉందని, కొద్దిసేపట్లో అది పేలుతుందని ఓ అగంతకుడి ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అక్కడకు చేరుకుని విజయ్ తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభనను అప్రమత్తం చేశారు. ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని హీరో విజయ్ ఇంటికి కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. సైబర్ క్రైమ్ క్రింద పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎవరు ఫోన్ చేశారు? అనే కోణంలో కేసుని పరిశీలించి ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
previous post
next post
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!