NewsOrbit
న్యూస్

‘కార్మికుల సమస్య:కేంద్రం జోక్యం చేసుకోవాలి’  

హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్‌టిసి కార్మికులు నవంబర్ అయిదవ తేదీలోగా బేషరుతుగా విధుల్లో చేరాలనీ, అలా చేరితేనే వారికి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ హుకుం జారీ చేసిన నేపథ్యంలో సమస్యను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లాలని ఆర్‌టిసి జెఎసి నాయకులు నిర్ణయించారు. ఆదివారం రాష్ట్ర బిజెపి నేతలతో పాటు టిజెఎస్, సిపిఐ, టిడిపి నేతలను జెఎసి నేతలు కలిశారు. తాము చేస్తున్న సమ్మెను జాతీయ స్థాయిలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్‌టిసి పరిస్థితిని అమిత్‌షాకు వివరించి జోక్యం చేసుకోవాల్సిందిగా కోరతామని జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు.

ఇదిలా ఉండగా ఆర్‌టిసి కార్మికులు విధుల్లో చేరాలని ప్రభుత్వం పిలుపు నిచ్చిన నేపథ్యంలో విధుల్లో చేరే కార్మికులకు పూర్తి భద్రత కల్పిస్తామని రాచకొండ సిపి మహేష్ భగవత్, సైబరాబాద్ సిపి సజ్జనార్‌లు తెలిపారు. సిబ్బంది నిర్భయంగా విధుల్లో చేరవచ్చని వారు చెప్పారు. ‌

కెసిఆర్ ప్రకటన నేపథ్యంలో కార్మికుల్లో అలజడి రేగే ప్రమాదం ఉందని భావించిన కార్మిక జెఏసి నేతలు ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించారు. ప్రభుత్వ హెచ్చరికలకు భయపడేది లేదనీ, సమ్మె కొనసాగుతుందనీ ప్రకటించారు. అయితే సిరిసిల్ల, సిద్దిపేట, భద్రాచలం డిపోలలో కార్మికులు విధుల్లో చేరుతామని లేఖలు ఇచ్చారు. సిరిసిల్ల డిపో మెకానిక్‌ శ్రీనివాస్‌, సిద్దిపేట డిపో కండక్టర్‌ విశ్వేశ్వరరావు విధుల్లో చేరారు.ఉప్పల్ డిపోకు చెందిన అసిస్టెంట్ డిపో మేనేజర్ కేశవ కృష్ణ తాను తిరిగి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డిపో మేనేజర్‌ను ఆదివారం కలిసి తన సమ్మతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తాను బేషరతుగా సమ్మె నుండి బయటకు వచ్చి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు.

Related posts

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

Leave a Comment