NewsOrbit
రాజ‌కీయాలు

‘టిడిపికి ‘హోదా’పై మాట్లాడే అర్హత లేదు’

అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడే అర్హత టిడిపికి లేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం సమస్యలపై టిడిపి సభ్యులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, డాక్టర్ నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చిన రాజప్ప, కింజరపు అచ్చెన్నాయుడు, కరణం బలరామకృష్ణ మూర్తి అడిగిన ప్రశ్నలపై మంత్రి కన్నబాబు సమాధానం ఇస్తూ టిడిపిపై విమర్శలు గుప్పించారు.పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి టిడిపి సభ్యులు మాట్లాడుతున్నారనీ, ఈ రాష్ట్రంలో పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం టీడీపీకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదనీ కన్నబాబు అన్నారు. పార్టీలే కాదు, బీ–ఫారాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారని ఆయన విమర్శించారు. 2014 నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వ్యక్తి తమ నాయకుడు వైయస్‌ జగన్‌ మాత్రమేనని అన్నారు.ఢిల్లీలో, గుంటూరులో దీక్షలు, ధర్నాలు చేయడంతో పాటు  యువభేరీ కార్యక్రమాలు నిర్వహించారని కన్నబాబు చెప్పారు. వైసిపి ఎంపిలతో జగన్‌ రాజీనామాలు కూడా చేయించారన్నారు.

ప్రత్యేక హోదా కన్నా, ప్రత్యేక ప్యాకేజీయే బెటరని అప్పట్లో బల్లగుద్దినట్టు ఇదే చంద్రబాబు చెప్పారని కన్నబాబు పేర్కొన్నారు.ఇప్పుడు అదే వ్యక్తులు నీతులు చెప్తున్నారని కన్నబాబు విమర్శించారు. ఆ రోజు సిఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అవసరంలేదు, ప్రత్యేక ప్యాకేజీ చాలని చంద్రబాబుగారు చెప్పారా? లేదా? వివరించాలని కన్నబాబు కోరారు.ఆ తర్వాత  ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారనీ, జగన్మోహన్‌రెడ్డిని అభిమానిస్తున్నారనీ రాత్రికి, రాత్రి చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని కన్నబాబు అన్నారు.హైదరాబాద్‌ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నా  ఓటకు కోట్లు కేసులో దొరికిపోయి పారిపోయి ఈ రాష్ట్రానికి వచ్చేశారని కన్నబాబు విమర్శించారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బాధపడే పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు.నాడు చేసిందంతా చేసి ఇవాళ నీతి కథలు, పిట్ట కథలు చెప్తున్నారని కన్నబాబు విమర్శించారు.

రాష్ట్రానికి మోది అన్యాయం చేశారని ఎన్నికల ముందు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ మోదితో జతకట్టే ప్రయత్నం చేస్తున్నారని కన్నబాబు అన్నారు. నలుగురు ఎంపీలను బిజెపిలోకి వలస పంపించి మళ్లీ ఇక్కడ మరోలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. అదే విధంగా ఆస్తుల పంపిణీ గురించి కూడా ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.

ప్రస్తుతం తెలంగాణకు ఇచ్చిన భవనాల్లో ఏదీ కూడా విభజన చట్టంలోని పరిధిలోనివి కాదని కన్నబాబు అన్నారు. విభజన చట్టంలో భవనాల్లోని ఒక్క గదిని కూడా తెలంగాణకు అప్పగించలేదని వివరించారు.టిడిపి అధికారంలో ఉండగా విభజన చట్టంలోని భవనాలను ఆక్రమిస్తే ఒక్కసారి కూడా మాట్లాడలేదని కన్నబాబు గుర్తు చేశారు.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Leave a Comment