యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్న చిత్రం ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఈ చిత్రాన్ని తెలుగులో గ్రా్‌ండ రిలీజ్ చేస్తుంది. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ రెండు భాగాలుగా రూపొందింది. ‘కె.జి.యఫ్ౠ చాప్టర్ 1’ను ప్యాన్ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. దీంతో ‘కె.జి.యఫ్ చాప్టర్2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను డిసెంబర్ 21 విడుదల చేస్తున్నారు. అలాగే 2020లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. రవి బస్రూర్ సంగీతం, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
previous post
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!