NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రేవంత్ ఒంటరేనా…??

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కెసిఆర్) లక్ష్యంగా తీవ్ర విమర్శలు సంధిస్తూ ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన టి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఒంటరి వాడు అవుతున్నాడా? కెసిఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం వ్యక్తిగతమా? రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేతలే మండిపడటానికి కారణాలు ఏమిటి? అనే విషయాలపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అన్నది అందరికీ తెలిసిందే. మొదట తెలుగుదేశంలో ఉన్నప్పుడు గానీ ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కూడా రేవంత్ రెడ్డి..ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన కుటుంబంపై తరచు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల క్రమంలోనే టిడిపి హయాంలో ఉండగా ఒక సారి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు జైలుకు వెళ్లారు. ఇటీవల కెసిఆర్ ఫామ్ హౌస్ వద్ద అనుమతులు లేకుండా డ్రోన్‌ కెమెరా వినియోగించారన్న అభియోగంపై అరెస్టు చేసి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఆయన బెయిల్ ధరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన రిమాండ్ ఖైదీగానే ఉన్నారు. వీటికి తోడు గోపన్‌పల్లి భూకుంభకోణం ఆరోపణలు కూడా ఆయనపై చుట్టుమట్టాయి.

ఈ నేపథ్యంలోనే ఆయనపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. సీనియర్ నేత వి హనుమంతరావు ఒక అడుగు ముందుకు వేసి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని మాట్లాడటానికి ఇది ప్రాంతీయ పార్టీ కాదనీ, ఏ విషయంపై అయినా కాంగ్రెస్ పార్టీలో చర్చించి పోరాటాలపై నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. ఆయన (రేవంత్)పై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు ఇంకో అంశాన్ని తెరపైకి తీసుకురావడం సరికాదని అంటున్నారు విహెచ్. జివో 111, మంత్రి కెటిఆర్ ఫామ్ హౌస్ విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం ఆయన వ్యక్తిగతమైనదని విహెచ్ వ్యాఖ్యానించారు. ఎలాంటి అంశమైనా పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలనీ, ఎవరికి వారుగా కార్యక్రమాలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. కొన్నేళ్లుగా పార్టీలో పని చేస్తున్న నేతలను ఇబ్బందిపెట్టేలా రేవంత్ రెడ్డి వ్యవహరించడం మంచి పద్ధతి కాదని మరో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు వెంటనే కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను, పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఆయన కోరారు.

ప్రధానంగా కెటిఆర్ ఫామ్ హౌస్ జివో నెం.111ను ఉల్లంఘించి కట్టారని ఆరోపిస్తున్నారో ఆ జివోనే రద్దు చేయాలని ఆ పార్టీ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనర్శింహాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ జివో వల్ల తమ ప్రాంతంలో అనేక మంది రైతులు, పారిశ్రామిక వేత్తలు ఇబ్బందులు పడుతున్నారనీ, కాంగ్రెస్ హయాంలోనే ఈ జివో రద్దు చేయాలని తాము ప్రతిపాదించామనీ వారు చెబుతున్నారు.
ఈ వ్యవహారంలో పోరాటం చేస్తూ రేవంత్ రెడ్డి అరెస్టు కాగా కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రమే ఖండించారు. రేవంత్ అరెస్టు వ్యవహారాన్ని అటు పార్లమెంట్‌లో, ఇటు అసెంబ్లీలోనూ చర్చించాలని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు పట్టుబట్టలేదు అంటే ఆ పార్టీ నాయకులు దీన్నిలైట్‌గా తీసుకున్నారా అనే వాదన వినిపిస్తోంది.

కాంగ్రెస్ సీనియర్‌ల వ్యవహారాల శైలి రేవంత్ వర్గీయులకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో వీరు రేవంత్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టాలని కూడా సోషల్ మీడియాలో చర్చ చేస్తున్నారు.
కొడంగల్ నియోజకవర్గం నుండి వరుసగా రెండు సార్లు టిడిపి అభ్యర్థిగా గెలిచిన రేవంత్ రెడ్డిని 2017 అక్టోబర్ మొదటి వారంలో టిడిపి సస్పెండ్ చేయడంతో అదే నెల చివరిరో ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. స్టార్ క్యాంపెయినర్ ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఆ ఎన్నికల్లో తొలి సారిగా ఆయన కొడంగల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేంద్రరెడ్డి చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. అయితే కొడంగల్‌లో ఓటమి తర్వాత రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంపై దృష్టి సారించి 2019 ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే అదే జోష్‌తో మున్సిపల్ ఎన్నికల్లోనూ తన సత్తా చాటి కొడంగల్‌లో పాగా వేయాలని రేవంత్ రెడ్డి భావించినా ఫలితాల్లో మాత్రం వ్యతిరేక పవనాలు వీచాయి. కొడంగల్ మున్సిపాలిటీలో ఉన్న 12 వార్డుల్లో 8 వార్డులు అధికార టీఆర్‌ఎస్ కైవశం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సొంత నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి పట్టు సాధించలేకపోవడంతో ఆ పార్టీ సీనియర్‌లు కొందరు ఆయన ఒంటెత్తు పోకడలకు పోతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయో వేచి చూడాల్సి ఉంది.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Leave a Comment