NewsOrbit
రాజ‌కీయాలు

ఆఖరి గీత దాటేశాడు.. రఘురామ కృష్ణంరాజు సస్పెన్షన్ గ్యారెంటీ?

రాష్ట్రంలో జరుగుతున్న పలు పరిణామాలపై అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్ శాసన సభ్యులే ఇటీవల కాలంలో బాహాటంగా విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడే ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయింది.

తొలి నుండి నర్సాపురం ఎంపి రఘు రామ కృష్ణంరాజు చర్యలు సంచలనాత్మకంగానే ఉన్నాయి. ఇటీవల ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాల గురించి మీడియా ముందు మాట్లాడారు. సీఎం జగన్ వద్ద కోటరీ ఉందని, క్షేత్ర స్థాయిలో విషయాలు అయన వరకు వెళ్లడం లేదని, పలు విషయాలు తమ నేత, సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకుని వెళ్లాలని ప్రయత్నించినా తనకు అపాయింట్మెంట్ లభించలేదని కూడా మీడియా ముఖ్యంగా వెల్లడించారు. వైఎస్ఆర్ సీపి ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ పై రఘురామ కృష్ణంరాజు విమర్శలు చేయడంపై నర్సాపురం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రఘు రామ కృష్ణంరాజుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. సీఎం జగన్ మూలంగానే అయన ఎంపి అయ్యారని, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవి కూడా దక్కిందని ప్రసాదరాజు అన్నారు. సీఎం జగన్ చుట్టూ కోటరీ అంటూ ఏది లేదని, జగన్ కు అందరూ సమానమేనని పేర్కొన్నారు. ప్రసాదరాజు వ్యక్తిగతంగా విమర్శలు చేయడంపై రఘు రామ కృష్ణంరాజు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. వచ్చే మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి ఖరారు చేసుకోవడానికి ప్రసాదరాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అయనతో ఎవరు మాట్లాడిస్తున్నారో తనకు తెలుసనీ, తన మిత్రుడు ప్రసాదరాజుకు మంత్రి పదవి దక్కాలని కోరుకుంటున్నానని రఘు రామ కృష్ణంరాజు అన్నారు. తన విజయానికి, పార్లమెంటరీ పదవి దక్కడానికి తన వ్యక్తిగత ఇమేజ్ కారణమని పేర్కొన్నారు రఘు రామ కృష్ణంరాజు. ఈ సందర్భంలో పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే విధంగానే అయన సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమైంది.

రఘురామ కృష్ణంరాజుకి బీజేపీతో పాత స్నేహం ఉండటంతో అయన బీజేపీలోకి వెళతారని కూడా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ సెంట్రల్ హల్ వద్ద ప్రధాని మోడీ..రాజు గారు బాగున్నారా అంటూ విష్ చేసినప్పటి నుండి అయన బీజేపీకి దగ్గర అవుతున్నారని ప్రచారం జోరుగా సాగింది. మరో పక్క వైకాపా సోషల్ మీడియాలో రఘురామ కృష్ణంరాజుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కామెంట్ లు చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా ఒకే పార్టీకి చెందిన ఎంపి, ఎమ్మెల్యే పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం ఎక్కడకు దారితీస్తుందో?, పార్టీ అధిష్టానంపైనే విమర్శలు చేసిన నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? లేక ఈ వివాదాన్ని సీఎం జగన్ ఏవిధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.

Related posts

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?