NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: పెగాసస్ పై హౌస్ కమిటీ విచారణ కు అసెంబ్లీ ఆమోదం

AP Assembly: పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై విచారణ జరిపేందుకు హౌస్ కమిటీ వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. సోమవారం అసెంబ్లీలో పెగాసస్‌ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. అధికారపక్ష సభ్యుల డిమాండ్ తో హౌస్‌ కమిటీ వేస్తున్నామని స్పీకర్ ప్రకటించారు. ఈ వ్యవహారంపై విచారణ హౌస్‌ కమిటీ విచారణ చేపడుతుందని తెలిపారు. దీనికీ సంబంధించి కమిటీ సభ్యులను రేపు లేదా ఎల్లుండి ప్రకటిస్తామన్నారు. పెగాసస్‌ స్పైవేర్‌పై చర్చలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. పెగాసస్‌ వంటి స్పైవేర్‌తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందన్నారు. ఇది ప్రమాదమే కాదు.. అనైతికమని కూడా అన్నారు. చంద్రబాబు పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొన్నారని స్వయం గా బెంగాల్ సీఎం మమతా చెప్పారన్నారు.

AP Assembly speaker tammineni announced house committee on pegasus
AP Assembly speaker tammineni announced house committee on pegasus

 

ఈ స్పైవేర్‌తో వ్యక్తిగత వివరాలన్నీ తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి అనైతిక కార్యక్రమాలు ఇల్లీగల్‌గానే చేస్తారని విమర్శించారు. చంద్రబాబు చేసిన ఈ చర్య.. మానవహక్కులకు భంగం కలిగించడమేనని అన్నారు. పెగాసస్‌ను కొనడం.. ఘోరమైన నేరమన్నారు. చంద్రబాబుకు అడ్డదారి రాజకీయాలు మాత్రమే తెలుసని అన్నారు. పెగాసస్‌ను చంద్రబాబు రాజకీయనేతలపై ఉపయోగించారని అ‍న్నారు. 2016లో పెగాసస్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు కొన్నారంటే ఎంత దుర్మార్గం అని తెలిపారు. పెగాసస్‌తో ఏం చేశారో  దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

సేవామిత్ర యాప్‌ ద్వారా కూడా టీడీపీ.. ఓటర్లపై నిఘా పెట్టిందని మంత్రి బుగ్గన ఆరోపించారు. వైసీపీకి అనుకూలంగా ఉండేవారి ఓట్లను తొలగించారని అన్నారు. ఆధార్‌ డేటా సేకరించి ఏ ఓటర్‌ ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకునే యత్నం జరిగిందన్నారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. గతంలో వైసీపీ నేతలతో పాటు, తన ఫోన్‌  ట్యాంపర్‌ అయిందని తెలిపారు. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి అఫిడవిట్‌ దాఖలు చేశారని చెప్పారు. ఇది రాజ్యాంగానికి విఘాతం కలిగించే చర్య అని సజ్జల అ‍న్నారని గుర్తుచేశారు. పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యే లు పెగాసస్ పై విచారణ కు హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి బుగ్గన ప్రతిపాదన మేరకు హౌస్ కమిటీ వేయనున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తొలుత పెగాసస్ పై సభలో చర్చ చేపట్టడం సరికాదు అంటూ టీడీపీ స్పీకర్ కు లేఖ ఇచ్చింది. అవాస్తవాలపై సభలో చర్చించటం విడ్డూరం టిడిపి సభ్యులు పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!