NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Cabinet Meet: జూన్ 7న ఏపీ కేబినెట్ భేటీ .. సీఎం జగన్ ఢిల్లీలో ఉండగానే ఆదేశాలు .. ముందస్తు ఎన్నికలపై మళ్లీ చర్చ..?

AP Cabinet Meet: ఏపి మంత్రి మండలి సమావేశం జూన్ 7వ తేదీన జరగనున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1 లో ఈ భేటీ జరగనుంది. ముడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ నీతి ఆయోగ్ సమావేశంలో, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తొలి రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో, మరుసటి రోజు శనివారం జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో, ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. అమిత్ షాతో తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించారని సమాచారం.

CM YS Jagan

 

ఢిల్లీ నుండే అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ ఏర్పాటునకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు రావడంతో మరో సారి ముందస్తు ఎన్నికలపై ఊహగానాలు వస్తున్నాయి. చాలా రోజుల నుండి ఏపిలో ముందస్తు ఎన్నికలు అంటూ ఊహగానాలు వినబడుతున్నాయి. అయితే వైసీపీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని కొట్టి పారేస్తూ వస్తున్నారు. అయితే రాజకీయ నాయకుల మాటలకు అర్ధాలే వేరులే అన్నట్లు ముందస్తుకు వెళ్లము అని చెబుతున్నారు అంటే వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇంతకు ముందు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టక ముందు పలువురు మీడియా ప్రతినిధులు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ని ప్రశ్నించగా, అటువంటిది ఏమీ లేనట్లు చెప్పారు. ఆ తర్వాతనే అసెంబ్లీలో సీఎం జగన్ మూడు రాజధానుల కన్సెప్ట్ గురించి మాట్లాడారు.

రాజకీయ నాయకులు చెప్పింది చేయరు. చేసేది చెప్పరు అనే నానుడి ఉంది.  ఈ కారణంగా అధికార పార్టీ నేతలు ముందస్తుకు వెళ్లము అని కొట్టిపారేస్తున్నా దానిపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టెంబర్ నెలలో విశాఖ షిప్ట్ అవుతాననీ, అక్కడి నుండే పాలన మొదలు పెడతామని చెప్పేశారు. మూడు రాజధానుల విధానంతోనే ఎన్నికలకు వెళతామని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంతకు ముందు ప్రకటించారు. దాదాపుగా తెలంగాణతో పాటే ఏపిలో ఎన్నికలకు జగన్ సిద్దమవుతున్నారనే మాట వినబడుతోంది. కేంద్ర పెద్దలు అనుకూలంగా ఉన్న సమయంలోనే ఎన్నికలకు వెళితే లాభదాయకంగా ఉంటుందనేది జగన్ అంచనాకు వచ్చారని ఒక ప్రచారం జరుగుతోంది.

సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని జగన్ భావిస్తున్నా.. ముందస్తు ఎన్నికలు కోరుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి నిధుల సమస్య తీవ్రంగా ఉంది. కేంద్రం నుండి నిధులు రావడమో, లేక అప్పులో పుట్టకపోతే సంక్షేమ పథకాలను కొనసాగించలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి నిలిచిపోయినా, వాయిదా పడినా ఆయా వర్గాల్లో వ్యతిరేక భావన పెరిగే ప్రమాదం ఉంది. అంతే కాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈజీ గెలుస్తామని వైసీపీ లెక్కలు వేసుకున్నా అసలు పోటీయే లేదు అనుకున్న టీడీపీ మూడింటికి మూడు స్థానాలు కైవశం చేసుకుంది.

అంటే యువత, విద్యావంతుల్లో జగన్ పాలనపై వ్యతిరేకత ఉందని వైసీపీ వర్గాలకు అర్ధం అయ్యింది. గ్రామీణ ప్రాంత ఓటర్లలో కూడా ఆ వ్యతిరేకత మొదలైతే మొదటికే ప్రమాదం వస్తుందని భావిస్తొంది. ఈ రెండు కారణాలతో ముందస్తుకు వెల్లడమే మేలనే ఆలోచనలో వైసీపీ వర్గాలు ఉన్నయనేది టాక్. ఇక జూన్ 7వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం, మూడు రాజధానుల అంశం, ముందస్తు ఎన్నికలు తదితర కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Breaking: రామోజీకి బిగ్ షాక్ .. రూ.793 కోట్ల ఆస్తులను ఆటాచ్ చేసిన ఏపీ సీఐడీ

Related posts

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N