NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Skill Scam: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో కీలక విషయాలు వెల్లడించిన సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్

Advertisements
Share

AP Skill Scam: టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు రిమాండ్ తర్వాత కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు చెప్పదల్చుకున్నామంటూ సీఐడీ ఏడీజీ సంజయ్ ఈ స్కామ్ నకు సంబంధించి పలు కీలక విషయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

Advertisements

స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు అసలు కేబినెట్ ఆమోదమే లేదని చెప్పారు. దాదాపు 13 చోట్ల అప్పటి ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు స్వయంగా సంతకాలు చేశారని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో గతంలో టీడీపీ కోసం సుదీర్ఘ కాలం పని చేసిన ఆడిటర్‌ను నియమించారని చెప్పారు. కేబినెట్ ఆమోదం లేకుండా, కేవలం జీవో ద్వారానే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. ప్రైవేట్‌ వ్యక్తి గంటా సుబ్బారావుకు మూడు బాధ్యతలు అప్పగించారని చెప్పారు.

Advertisements

ప్రభుత్వం విడుదల చేసిన రూ. 313 కోట్ల లో రూ. 241 కోట్లు నేరుగా షెల్‌ కంపెనీకి వెళ్లాయన్నారు సంజయ్. ఆ రూ. 241 కోట్లను షెల్‌ కంపెనీ నుంచి వివిధ రూపాల్లో మళ్లించారని తెలిపారు. రూ. 241 కోట్లు ఎందుకు మళ్లించారని ప్రశ్నిస్తే సమాధానం లేదన్నారు. ఈ స్కామ్‌పై జర్మనీలోని సీమెన్స్‌ యాజమాన్యాన్ని కూడా తాము సంప్రదించామనీ, ఉద్యోగులు తమకు వాస్తవాలు చెప్పకుండా దాచారని సీమెన్స్‌ తెలిపిందన్నారు.

తమకు రూ. 58.8 కోట్లు మాత్రమే అందాయని సీమెన్స్ తెలిపిందన్నారు సంజయ్. ఆరు చోట్ల కేంద్రాలు పెట్టాలని నిర్ణయించారనీ అయితే అవి ఎక్కడ పెట్టాలని తేల్చకముందే డబ్బు విడుదల చేశారన్నారు. రూ.370 కోట్ల ఒప్పందంలో సాఫ్ట్‌వేర్‌ ఖర్చును మినహాయించినా.. మిగిలిన రూ. 311 కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నిస్తే సమాధానం లేదన్నారు. చంద్రబాబుపై తాము చేసిన అభియోగాలకు సంబంధించి ఆధారాలను పరిశీలించిన తర్వాతనే ఏసీబీ కోర్టు రిమాండ్ ఇచ్చిందని సంజయ్ వివరించారు.

YS Jagan: డిల్లీ వెళ్ళిన జగన్ .. చంద్రబాబు మీద కొత్త స్కాం పట్టుకొచ్చాడు !


Share
Advertisements

Related posts

F 3 : ఎఫ్ 3 కూడా సంక్రాంతికే.. కన్‌ఫర్మ్ చేసిన వెంకీ షాక్ లో స్టార్ హీరోలు

GRK

భారతీయ యూజర్లు కోసం గూగుల్, సరికొత్త ఫీచర్స్ …….

Vissu

Piles: ఇది ఒక్కటి తింటే చాలు ఫైల్స్ నయం..!!

bharani jella