Chandrababu ACB Court: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ సీఐడీ అధికారులు మరో పీటీ వారెంట్ ను ఏసీబీ కోర్టులో దాఖలు చేసారు. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబుపై పీటీ వారెంట్ దాఖలు చేయగా, హైకోర్టులో కేసు విచారణ నేపథ్యంలో ఏసీబీ కోర్టు విచారణను వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ వారెంట్ ను వేసింది. టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్దంగా చంద్రబాబు ఫైబర్ నెట్ కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ అధికారులు అభియోగం మోపారు. ఫైబర్ నెట్ స్కామ్ లో రూ.115 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని సిట్ దర్యాప్తులో తేల్చింది. 2021లోనే ఫైబర్ నెట్ స్కామ్ కేసులో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. నాటి ఎఫ్ఐఆర్ లో ఏ 1 గా వేమూరి హరిప్రసాద్, ఏ 2 గా ఎండీ సాంబశివరావుగా పేర్కొంది. ఈ కేసులో ఏ 1 వేమూరి హరిప్రసాద్ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడని సీఐడీ పేర్కొంది. ఫైబర్ నెట్ లో చంద్రబాబు పేరును 25వ నిందితుడిగా చేరుస్తూ సీఐడీ మెమో జారీ చేసింది. ఫైబర్ నెట్ పై వేసిన పీటీ వారెంట్ కు అనుబంధంగా మోమో దాఖలు చేసింది.
మరో పక్క స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో సమయం కావాలని కోరారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనల దృష్ట్యా కౌంటర్ దాఖలునకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరగా ఏసీబీ కోర్టు .. కస్టడీ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది.
AP High Court Chandrababu Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ముగిసిన వాదనలు .. హైకోర్టు ఏమన్నదంటే..?