NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి  – జలవనరుల సంరక్షణపై అంతర్జాతీయ సద్సస్సులో సీఎం జగన్

Share

CM YS Jagan: విశాఖ రుషికొండలోని రాడిసన్ హోటల్ నందు జలవనరుల సంరక్షణపై వారం రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు (25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ(ఐసీఐడీ) కాంగ్రెస్ ప్లీనరీ)ని కేంద్ర జలశక్తి మంత్రి  గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. వ్యవసాయం నీటి కొరతను అధిగమించడం అనే థీమ్ తో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఐసీఐడీ అధ్యక్షుడు డాక్టర్ రాగబ్, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మంత్రులు విడతల రజిని, గుడివాడ అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు భారత్ నుండి 300 మంది, అస్ట్రేలియా, బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియా, ఇరాక్, ఇరాన్, ఇజ్రాయిల్, జపాన్, కొరియా, మలేషియా, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం ఇలా 74 దేశాల నుండి 900 మందికిపైగా ప్రతినిధులు హజరయ్యారు.

ఈ సందర్భంగా  ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ నీటి పారుదల రంగంపై అంతర్జాతీయ  సదస్సు ఇక్కడ జరగడం శుభపరిణామం అని అన్నారు. సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో ప్రభుత్వం సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉందన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యమన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరుచూ కరువు వస్తొందన్నారు. వర్షం కురిసేది తక్కువ కాలమేనని, ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలని అన్నారు. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని సీం జగన్ పేర్కొన్నారు.  

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ నీటి పారుదల రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఇరిగేషన్ పై ప్రత్యేకంగా పోకస్ పెడుతున్నామని వివరించారు. ప్రపంచ దేశాలకు భారత్ అతి పెద్ద ఎగుమతిదారుడుగా వృద్ది చెందుతోందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తామని చెపారు. మోడీ నేతృత్వంలో రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నామని వివరించారు. భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్తు తరాలకు ఉపయోగమన్నారు. వాటర్ రీసైక్లింగ్ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నామన్నారు.

తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు షెకావత్. 2019 లో మోడీ నేతృత్వంలో జలశక్తి అభియాన్ ప్రారంభించామని చెప్పారు. జలశక్తి అభియాన్ తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. నదుల అనుసంధానం ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ఉత్తరప్రదేశ్, మద్య ప్రదేశ్ లో ఉన్న నదులను అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. డ్యామ్ సెఫ్టీ యాక్ట్ ల ద్వారా డ్యామ్ ల పరిరక్షణ జరుగుతోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్యామ్ లను పరిరక్షిస్తున్నామని వివరించారు. ప్రపంచ బ్యాంక్ సహకారంతో డ్యామ్ ల పరిరక్షణ జరుగుతోందని షెకావత్ తెలిపారు.

IT Rides: హైదరాబాద్ లో మరో సారి ఐటీ సోదాల కలకలం .. కాంగ్రెస్ నేతల్లో గుబులు


Share

Related posts

బిగ్ బాస్ కొంపముంచిన మెహబూబ్..!!

sekhar

రైతుల ముంగిట్లో మ‌ళ్లీ త‌న స‌త్తా చూపించుకున్న జ‌గ‌న్‌

sridhar

Anushka – Samantha: జేజమ్మ మరియు రామలక్ష్మి ఇద్దరు ఒకే స్క్రీన్ పై???

Naina