NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ కు ఊరట .. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణను వాయిదా వేసిన హైకోర్టు

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఫైబర్ గ్రిడ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నోటీసుల్లో నిబంధనలను సవాల్ చేస్తూ మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ ను అరెస్టు చేస్తారన్న ఆందోళన తమకు ఉందని లోకేష్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

This file is enough soon Nara Lokesh was arrested
 Nara Lokesh

అయితే లోకేశ్ ను ఇంత వరకూ ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ఒక వేళ నిందితుడిగా చేరిస్తే ఆయనకు సీఆర్పీసీలోని 41 ఏ కింద నోటీసులు ఇస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. 41ఏ నిబంధనలు పాటించకపోతే న్యాయస్థానానికి విన్నవిస్తామని లోకేష్ తరపు న్యాయవాది చెప్పారు. దీంతో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ ముగించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41ఏ నోటీసులు జారీ చేయడం, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో హైకోర్టు నుండి మధ్యంతర బెయిల్ మంజూరు చేసి ఉండటంతో లోకేష్ అరెస్టు భయం నుండి బయటపడినట్లు అయ్యింది.

ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణను అక్టోబర్ 10వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 4వ తేదీ విచారణకు హజరు కావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 41 ఏ నోటీసులో నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. హెరిటేజ్ సంస్థలో లోకేశ్ షేర్ హోల్డర్ అని, ఆయనకు తీర్మానాలు ఇవ్వాలన్నా, బ్యాంకు ఖాతా పుస్తకాలు ఇవ్వాలన్నా కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని ఆయన తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు న్యాయస్థానంకు వివరించారు. లోకేశ్ ను ఇవి సీఐడీ అడగడం సమంజసం కాదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

nara lokesh

తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమనీ, బుధవారమే (4వ తేదీ) విచారణకు హజరు కావాలని సీఐడీ తరపు న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన పోసాని అంత తొందరేముందని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం అక్టోబర్ 10వ తేదీన సీఐడీ విచారణకు లోకేశ్ హజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. 10వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాదిని అనుమతించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Pawan Kalyan: వైసీపీ సర్కార్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju