NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: వైసీపీ సర్కార్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Share

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాల్గవ విడత వారాహి యాత్ర కృష్ణాజిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా ఇవేళ మచిలీపట్నంలో జనసేన జనవాణి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ నిర్వహించారు. వివిధ వర్గాల ప్రజల నుండి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రేపు పెడనలో వారాహి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర చేస్తొందంటూ సంచలన కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్.

రేపు పెడన సభను అడ్డుకునేందుకు క్రిమినల్స్ ను దింపాలనే సమాచారం తమకు ఉందని అన్నారు. పబ్లిక్ మీటింగ్ లో రాళ్ల దాడి చేసి గొడవ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. తమ పెడన సభలో గొడవలు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం, డీజీపీ ఇతర అధికారులు జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలన్నారు. టీడీపీ, జనసేన పొత్తును విచ్చిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాళ్ల దాడి జరిగినా, క్రిమినల్స్ ఎటాక్ చేసినా ప్రభుత్వం, డీజీపీదే బాధ్యత అని అన్నారు. జిల్లా ఎస్పీలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి వచ్చినా జనసేన కార్యకర్తలు వారిపై దాడి చేయవద్దనీ, వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు అప్పగిద్దామన్నారు. పులివెందుల రౌడీయిజం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. దాడులు చేస్తే జనసేన సైనికులు ఎదురు దాడి చేయవద్దని సూచించారు. ఎవరు అనుమానంగా కనిపించినా, జేబుల్లో నుండి ఆయుధాలు, రాళ్లు తీసినా వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు సూచించారు.

Revanth Reddy: ఓటుకు నోటు కేసు.. సుప్రీం కోర్టులో రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ


Share

Related posts

వింత వ్యాధి- వింత కారణాలు..! ఏది కల్పితం – ఏది వాస్తవం..!?

Srinivas Manem

YSR: వైఎస్ పై తెలంగాణ నేతల విసుర్లు..! రాజకీయమే కారణమా ..?

Muraliak

రెడ్ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన రాం.. సంక్రాంతి బరిలో రచ్చ రచ్చే ..!

GRK