NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు ఎదురు లేదు. అందులో భువ‌న‌గిరి పార్ల‌మెంటు స్థానంలో కూడా కాంగ్రెస్‌కు తిరుగులేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం జ‌న‌గామ త‌ప్పితే మిగ‌తా ఆరుచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం నుంచి మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి, మునుగోడు నుంచి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, ఆలేరు నుంచి బీర్ల ఐల‌య్య‌, తుంగ‌తుర్తి నుంచి మంద‌ల శ్యామేల్‌, భువ‌న‌గిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, న‌కిరేక‌ల్ నుంచి వేముల వీరేశంలు, జ‌న‌గామ నుంచి ప‌ల్లే రాజేశ్వ‌ర‌రెడ్డి బీ ఆర్ ఎస్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌, బీ ఆర్ ఎస్ పార్టీల ప‌రంగా చూస్తే కాంగ్రెస్ పార్టీదే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పై చేయిగా ఉంది.
అయితే ఇక్క‌డ బీసీ కార్డును ఉప‌యోగించాయి బీ ఆర్ ఎస్‌, బీజేపీలు. కాంగ్రెస్ మాత్రం రెడ్డి సామాజిక వ‌ర్గంకు చెందిన వ్య‌క్తికి టికెట్ ఇచ్చింది. బీజేపీ ఈ స్థానంలో పాగా వేయాల‌ని అనేక ప‌థ‌కాలు ర‌చిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో పాటు బీసీ వర్గానికి చెందిన మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌కి టికెట్‌ కేటాయించింది. డాక్ట‌ర్ బూర న‌ర్స‌య్య గ‌తంలో బీ ఆర్ ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన న‌ర్స‌య్య‌కు డాక్ట‌ర్ గా పేరుంది.

బీజేపీ దీని ద్వారా ఈ స్థానంలో బలమైన పోటీకి తెర లేపింది. ఈ స్థానంలో బీఆర్‌ఎస్‌ సైతం యాద‌వ సామాజిక వ‌ర్గంకు చెందిన‌ బీసీ నేత క్యామ మల్లేశ్‌కు టికెట్‌ను కేటాయించింది. బీసీ ఓటర్లని గంపగుత్తగా తమవైపు తిప్పుకోవాలనే బీజేపీ వ్యూహం ర‌చిస్తే, బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూడా బీసీ నేత‌కు టికెట్‌ను కెటాయించి బీజేపీ ఆశ‌ల‌పై నీళ్ళు చ‌ల్లింద‌ని చెప్ప‌వ‌చ్చు. బీసీ ల ఓట్లు ఇద్ద‌రు అభ్య‌ర్థులు చీల్చ‌నున్న నేప‌థ్యంలో అధికార కాంగ్రెస్‌ కూడా విస్తృత ప్రజాసంబంధాలున్న పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డికి టికెట్‌ ఇచ్చింది.

కాంగ్రెస్‌కు ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం కలిసొచ్చే అంశం. అలాగే ఈ ఎమ్మెల్యేలందరూ గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలు సాధించారు. బీ ఆర్ ఎస్ కు ఒక ఎమ్మెల్యే ఉండ‌టంతో ఈ స్థానంలో కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ న‌డుమ‌నే ప్ర‌ధాన పోటీ ఉండే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అభిప్రాయ ప‌డుతున్నారు. మ‌రి బీజేపీ ఏ మేర‌కు ఇక్క‌డ రాణిస్తుందో వేచి చూడాల్సిందే.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N