ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం బిగ్ స్టోరీ

AP News: జగన్ కి కేంద్రం బిగ్ షాక్..! ఆ నిధుల లెక్కలేవి..!?

central govt questions ap govt
Share

AP News: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ భారీ ఎత్తున సంక్షేమ పథకాల అమలు చేస్తోంది. సీఎంగా జగన్ రాష్ట్ర పరిపాలన మొదలుపెట్టిన ఆరు నెలల తర్వాత నుంచీ కరోనా పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా.. సీఎం జగన్ వెనకడుగు వేయలేదు. దాదాపు రెండున్నరేళ్లుగా తాను పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అయితే.. ఈక్రమంలో రాష్ట్రం భారీగా అప్పులు చేసింది.. చేస్తోంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా సీఎం జగన్ వెనకడుగు వేయలేదు. అయితే.. పథకాల అమలుతో రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ లోపించిందనే విమర్శలూ ఎక్కువయ్యాయి. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వ తీరుపై లేఖలు రాస్తూనే ఉంది.

central govt questions ap govt
central govt questions ap govt

ఆర్ధికశాఖ లేఖ..

ముఖ్యంగా విదేశీ ఆర్ధిక సంస్థల నుంచి వచ్చే నిధుల వినియోగంపై కేంద్రం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేంద్ర ఆర్ధిక శాఖలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ నుంచి రాష్ట్ర ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ కు ఘాటుగా ఓ లేఖ అందింది. ఏఐఐబీ ఎన్ డీబీ నుంచి మంజూరైన రుణాలకు అడ్వాన్స్ ఇప్పించాలని కేంద్రానికి లేఖ రాసింది. అయితే.. కేంద్రం స్పందిస్తూ ముందుగా అడ్వాన్స్ రూపంలో తీసుకున్న  500 కోట్లకు సంబంధించి లెక్కలు అడిగింది. (AP News) రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిధులు జమ చేయకపోగా.. విదేశీ ఆర్ధిక సంస్థల నుంచి నిధులు ఎలా కేటాయిస్తామని ప్రశ్నించింది. ప్రతినెలా పనుల పురోగతి, నిధుల వినియోగానికి సంబంధించి కేంద్ర ఆర్ధిక శాఖ షరతలతో దాదాపు 8వేల కోట్ల  రుణం మంజూరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంది.

ఖర్చులు చెప్పేనా..

దీనిని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై కేంద్రం వద్ద లెక్కలున్నాయి. అయితా.. కేంద్రానికి రాష్ట్రం నుంచి సరైన సమాధానం చెప్పడంలేదని తెలుస్తోంది. గతంలో కూడా చాలాసార్లు కేంద్రం నుంచి (AP News) రాష్ట్రానికి లేఖలు వచ్చాయని తెలుస్తోంది. అయితే.. వీటిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మీడియా హైలైట్ చేస్తోంది. మరోవైపు రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం విరివిగా కోరుతోంది. ఇదే కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా తాను చేస్తున్న ఖర్చును ఎప్పటికప్పుడు వివరణ ఇస్తే.. ప్రతిపక్షాలకు, మీడియాకు సమాధానం చెప్పినట్టవుతుందనడంలో సందేహం లేదు.


Share

Related posts

Surrendered: అజ్ఞాతం వీడి పోలీసులకు లొంగిపోయిన టీడీపీ నేత కూన రవికుమార్

somaraju sharma

AP Municipal Elections: మూడు మున్సిపాలిటీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్..! వైసీపీ ఓడిపోతే వారి మంత్రి పదవులకు ఎసరు..! వైసీపీ ప్రతిష్టాత్మక పోరు..!!

Srinivas Manem

AP Govt: ఏపిలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లకు పదోన్నతులు

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar