NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ పొడిగింపు

chandrababu reaction about CID comments

Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ నెల 24వ వరకూ పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు వెల్లడించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయి రాజమహేంద్రవరం (రాజమండ్రి) సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబు రిమాండ్ గడువు ముగియడంతో ఆయనను పోలీసులు ఏసీబీ కోర్టులో వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హజరుపర్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయాన్ని న్యాయమూర్తి కోరారు.

chandrababu reaction about CID comments
chandrababu

తనను రాజకీయ కక్షతోనే జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని న్యాయమూర్తితో చంద్రబాబు చెప్పారు. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారనీ, తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని చంద్రబాబు అన్నారు.  తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని కోరారు. తనను అక్రమంగా అరెస్టు చేశారనీ, ఇదే తన బాధ, ఆవేదన, ఆక్రందన అని చంద్రబాబు అన్నారు. తనపై ఉన్నది ఆరోపణలు మాత్రమేననీ, నిర్ధారణ కాలేదన్నారు. చట్టానికి అందరూ సమనానమే, చట్టాన్ని గౌరవిస్తానని చంద్రబాబు అన్నారు. హక్కులు, రాజ్యాంగ విలువలను పరిరక్షించాలని చంద్రబాబు కోరారు.

మీరు పోలీసు కస్టడీలో లేరు. జ్యూడీషియల్ కస్టడీలోనే ఉన్నారని పేర్కొన్న జడ్జి .. మీరు దీన్ని శిక్ష గా భావించవద్దని చంద్రబాబుతో  అన్నారు. మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే.. నేర నిరూపణ కాలేదు. చట్టం, నిబందనల ప్రకారమే మీకు రిమాండ్ విధించామని న్యాయమూర్తి అన్నారు. జైలులో సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ సౌకర్యాలు అవసరమైతే దానికి అనుగుణంగా ఆదేశాలు ఇస్తామని జడ్జి చంద్రబాబు అన్నారు. మీరు 24వరకు జ్యూడిషియల్ కస్టడీలోనే ఉంటారని చెప్పారు. మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోంది. మీ తరపు న్యాయవాదులు కస్టడీ అవసరం లేదని వాదించారు. చట్టం ముందు అందరూ సమానమే అని జడ్జి పేర్కొన్నారు.

మరో పక్క చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇవేళ మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్పు వెల్లడించనున్నది. దీంతో చంద్రబాబు సీఐడీ కస్టడీపైనా ఏసీబీ కోర్టు తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ ఈ నెల 9వ తేదీన అరెస్టు చేసింది. ఆ మరుసటి రోజు వేకువజామున ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు చంద్రబాబును హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు.

AP Assembly:  మరో ముగ్గురు టీడీపీ సభ్యులు సస్పెన్షన్

 

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju