Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో వాడీవేడిగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. వాదనలు అన్నీ సెక్షన్ 17 ఏ చుట్టూ తిరుగుతున్నాయి. మధ్యాహ్న విరామం వరకూ సాల్వే, రోహత్గీ వాదనలు కొనసాగగా, తదుపరి విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది.

వాదనలు ఇలా..
చంద్రబాబుకు 17 ఏ వర్తిస్తుందని సాల్వే బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. 17ఏ చట్ట సవరణ ప్రధాన ఉద్దేశాలు అవినీతి నిరోధించడం.. ప్రజా ప్రతినిధులపై .. ప్రతీకార చర్యలు ఉండకూడదు అని తెలిపారు. యశ్వంత్ సిన్హా కేసులో రఫెల్ కొనుగోళ్లు, అనంతరం దాఖలైన .. కేసులపై హైకోర్టులో వచ్చిన తీర్పులను ఈ సందర్భంగా కోర్టులో ఉదహరించారు. సుప్రీం కోర్టులో తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటి ప్రకారం కేసు నమోదుకు ముందు గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి సాల్వే వాదించారు.
ప్రభుత్వ తరపు న్యాయవాది రోహత్గీ వాదనలు వినిపించారు. పాత నేరాలకు పాత చట్టాలు వర్తిస్తాయిన్నారు. 17A సవరణ సందర్భంగా చట్టంలో చాలా స్పష్టం చేశారు. 2018లో 17A వచ్చిన తర్వాత జరిగే నేరాలకే 17A అమలు చేయాలని చట్టంలోనే పేర్కొన్నారు. నేరం 2015-16లో జరిగింది కాబట్టి చంద్రబాబుకు 17A వర్తించదు. చంద్రబాబుకు పాత చట్టాలే వర్తిస్తాయి. నేరం జరిగిన రోజున ఉన్న చట్టాలే అమల్లోకి వస్తాయి అని ముకుల్ రోహత్గి వాదించారు.
2018 ముందు విచారణ కొంత వరకు జరిగి నిలిచిపోయింది., అంత మాత్రాన విచారణ జరగనట్లు కాదు అని పేర్కొన్నారు. 2018 మేలో మెమో దాఖలు చేశారనీ, అందులో తగిన వివరాలు ఉన్నాయంటూ మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బెంచ్ ముందు ఉంచుతున్నామన్నారు. విచారణ ముగిశాక పత్రాలు ఇచ్చామన్న దానిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్ఐఆర్ లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదని, ఆయనపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021 లో కేసు నమోదు చేశారన్నారు. కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలన్నారు.
17 ఏ ప్రకారం ఎంక్వయిరీ, ఇంక్వయిరీ, ఇన్వెస్టిగేషన్ దేనికీ అవకాశం లేదని బెంచ్ పేర్కొనగా, పబ్లిక్ ఇంట్రెస్ట్ తో నిర్ణయాలు తీసుకుని వ్యక్తి ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తే దానికి 17 ఏ ఎలా వర్తిస్తుందని అని రోహత్గీ వాదించారు. 17 ఏ ను అవినీతిని నిరోధించేందుకు తీసుకొచ్చారు. భారీ ఎత్తున అవినీతి జరిగినప్పుడు..అందులో ప్రాధమిక సాక్ష్యాలు ఉన్నప్పుడు కేవలం అధికార విధుల నిర్వహణగా పరిగణించలేం. 17 ఏ సవరణ నేరస్తులకు రక్షణ కవచంగా మారకూడదు. నిజాయితీపరులైన అధికారులు, ప్రజా ప్రతినిధులను అనవసర భయాల నుండి దూరం చేయడం కోసమే ఈ సవరణ చేశారు. నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టమే అమల్లోకి వస్తుంది అంటూ గతంలో ఇచ్చిన తీర్పును ముకుల్ రోహత్గీ ఉదహరించారు. వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది.
Nara Lokesh: లోకేష్ సీఐడీ విచారణ వేళ కీలక పరిణామం