NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: జ‌గ‌న్ మీద మ‌చ్చ పోతుందా… వివేకా హ‌త్య విష‌యంలో జ‌రిగేది అదేనా?

Visakha Ukku - Shok to TDP YS Jagan serious decision

YS Jagan: ఏపీ ముఖ్య‌మంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కెరీర్‌లో కీల‌క‌మైన అంశం. ఆయ‌న సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి వేగం పెంచింది. వివేకా హత్య కేసు రాజకీయంగా పలు విమర్శలకు తోడవ్వడంతో పాటు వివేకా కుమార్తె సునీత ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు కేసు వేగవంతం చేయాలని కోరడం చూస్తుంటే త్వరలోనే సీబీఐ బృందం దోషులను నిర్ధారించే అవకాశం ఉంద‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే … ఏపీ సీఎం పై ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ ప‌డ్డ‌ట్లే.

Visakha Ukku - Shok to TDP YS Jagan serious decision

అస‌లేం జ‌రిగింది?

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య నేప‌థ్యంలో సీబీఐ విచార‌ణ‌తోనే దోషులు తేలుతార‌ని భావించారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు వివేకా సన్నిహితులతో పాటు కీలక వ్యక్తులను విచారణ చేశారు. సీబీఐ విచారణలో భాగంగా పులివెందులకు చెందిన పలువురు కీలక వ్యక్తులను విచారణ చేసి హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అయితే, సీబీఐ బృందంలో పలువురికి కరోనా సోకడంతో మధ్యలో విచారణకు బ్రేక్ పడింది. అయితే, వివేకా కూతురు సునీత ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలో మ‌ళ్లీ విచార‌ణ జోరుగా సాగుతోంది.

ఇప్పుడు మ‌ళ్లీ విచార‌ణ‌

తాజాగా విచారణలో భాగంగా పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వివేకా సన్నిహితులతో పాటు కీలక వ్యక్తులను విచారణ చేశారు. పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం ఆర్ అండ్ బి గెస్ట్ లో మకాం వేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి సమీపంలో ఉన్న పాల డైరీ వ్యాపారులతో పాటు ఓ సెల్ పాయింట్ నిర్వాహకుడిని కూడా సీబీఐ బృందం ప్రత్యేకంగా విచారణ చేసింది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్ రెడ్డి కి చెందిన సెల్ ఫోన్ రిపేర్ నిమిత్తం సెల్ పాయింట్ లో గతంలో ఇచ్చాడని అందుకు కారణంగానే సెల్ పాయింట్ నిర్వాహకుడిని విచారణ చేసినట్లు తెలుస్తోంది. గతంలో సీబీఐ విచారణకు హాజరైన వారిని సైతం మరోసారి విచారణకు పిలిపించి స్టేట్మెంట్ రికార్డు చేస్తారని సమాచారం. ఇలా ఇక చివరి సారి అంటే సీబీఐ విచారణలో త్వరితగతిన కేసులో దోషులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే తెలుస్తోంది.

author avatar
sridhar

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju