NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Jagan: ఉద్యోగులకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..!?

employees shocked by cm jagan

YS Jagan: ఏపీ ప్రభుత్వానికి, ప్రభుత్వోద్యోగులకు మధ్య దూరం పెరగనుందా.. అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై మొదట్లో సంఘీభావం ప్రకటించిన ఉద్యోగ సంఘాలు.. దీనిపై విడుదలైన జీఓ చూసి.. అవాక్కవుతున్నారు. పెంచిన పీఆర్సీ కంటే.. పాత జీతాలే బాగున్నాయనే భావం వారిలో వ్యక్తమవుతోంది. హెచ్ఆర్ఏ తగ్గింపు, సిటీ కాంపన్సేటరీ అలవెన్సు రద్దు, పెన్షనర్లకు అందే అదనపు మొత్తంలో వయో పరిమితి పెంచడం.. ఇవన్నీ వారికి రుచించట్లేదు. నిజానికి సీఎంతో భేటీ అనంతరమే ఉద్యోగ సంఘాలతో పెంచిన 23 శాతం పీఆర్సీపై ఉద్యోగులు విముఖత చూపించారు. ఇప్పుడు ఈ జీవోతో నిప్పు రాజుకున్నట్టేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నట్టు తెలుస్తోంది.

employees shocked by cm jagan
employees shocked by cm jagan

ఉద్యోగ సంఘాల మాట ఇదీ..

ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు స్పందిస్తూ.. ఇలాంటి పీఆర్సీని తన సర్వీస్‌లో చూడలేదని అంటున్నారు. కుడిచేత్తో ఇచ్చి ఎడం చేత్తో వసూలు చేస్తున్న చందంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికంటే పాత పీఆర్సీ, డిఏలను  కొనసాగించడమే ఉత్తమమని అంటున్నారు. అశాస్త్రీయంగా ఇచ్చిన (YS Jagan) జీవోలను వ్యతిరేకిస్తున్నాం. ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో ఇది చీకటిరోజు. ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదని అన్నారు. సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తే వ్యతిరేక జీవోలు విడుదల చేశారని ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

కీలక నిర్ణయం తీసుకుంటారా..

దీంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచీ ఉద్యోగుల్లో ఉన్న భయాలే నిజమయ్యాయని చెప్పాలి. ప్రభుత్వం తెలివితేటలతో పాత డీఏలు ఇస్తూ.. నగదు కనిపించేలా చేసింది కానీ.. వాస్తవంలో ఉద్యోగులకు తత్వం బోధపడినట్టైంది. పీఆర్సీతో పెరగాల్సిన ఉద్యోగుల వేతనాలు వారికి కనిపించడం లేదు. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని.. అవసరమైతే సమ్మెకు దిగుతామని (YS Jagan) ఉద్యోగ సంఘాలు ప్రకటించడం పెద్ద ఉద్యమమే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులను మెప్పించాల్సిన ప్రభుత్వం ఇప్పుడు వారితో కయ్యమే పెట్టుకున్నట్టైంది. జరుగుతున్న పరిణామాలతో ప్రభుత్వంపై ఉద్యోగులకు దూరం పెరిగినట్టే. మరి.. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.. పీఆర్సీపై పునరాలోచన చేస్తుందో.. వేచి చూడాల్సిందే..!

 

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju