Kandukur(Prakasam): ప్రతి ఒక్కరూ బ్లడ్ గ్రూపు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక అన్నారు. బ్లడ్ గ్రూపు తెలుసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని కందుకూరు పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి కందుకూరు సబ్ బ్రాంచి వారి ఆధ్వర్యంలో పోస్టాపీసు సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్త గ్రూపు నిర్ధారణ పరీక్ష శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
Advertisements

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బ్లడ్ గ్రూపు తెలుసుకుని ఉండటం వల్ల అత్యవసర సమయంలో గర్బిణులు, అపరేషన్లు చేయించుకునే వారికి, ప్రమాదాలకు గురైన వారికి వెంటనే రక్తదానం చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
Advertisements
Advertisements