NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Jayaprada: తెలుగు రాష్ట్ర రాజకీయాలపై జయప్రద చూపు

Jayaprada: సినీ రంగం నుండి రాజకీయాల్లోకి ప్రవేశించిన బీజేపీ నాయకురాలు జయప్రద ఇకపై తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించారు. అయితే జయప్రద తెలంగాణ నుండి రాజకీయాల్లోకి వస్తారా లేక ఆంధ్రప్రదేశ్ నుండి రాజకీయాల్లోకి వస్తారా అనేది పార్టీ అధిష్టాన నిర్ణయంపై ఆధారపడి ఉంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు జయప్రద వెల్లడించారు. తెలుగు బిడ్డగా ఏపికి గానీ తెలంగాణకు గానీ రావాలని తాను కోరుకుంటున్నానని జయప్రద చెప్పారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు స్కిన్ లేజర్ క్లినిక్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంలో తన మనసులోని మాటను జయప్రద మీడియాకు వెల్లడించారు. తాను తెలుగు రాష్ట్రాల నుండి పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు జయప్రద. ప్రస్తుతం పరిస్థితుల్లో తాను జాతీయ రాజకీయాల్లో ఉండే కంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండటానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. తాను ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ క్యాడర్ లో ఉన్నాననీ, తాను ఇక్కడకు రావాలంటే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

Jayaprada looks over AP TS politics
Jayaprada looks over AP TS politics

Jayaprada: టీడీపీ ద్వారా రాజకీయ అరంగ్రేటం

జయప్రద స్వస్థలం ఏపిలోని రాజమండ్రి. 2005 వరకూ మూడు దశాబ్దాల పాటు ఆరు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాళం, బెంగాలీ) దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం తరువాత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు 1984లో జయప్రద టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత చంద్రబాబు పక్షంలో చేరి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా పని చేశారు. 1986లో సినీ నిర్మాత శ్రీకాంత్ నవాతాను వివాహం చేసుకున్నారు. 1996లో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైయ్యారు. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన విభేదాల కారణంగా టీడీపీకి రాజీనామా చేశారు.

 

ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ ఆధ్వర్యంలో సమాజ్ వాది పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ తన జన్మభూమి కాగా ఉత్తరప్రదేశ్ తన కర్మభూమిగా పేర్కొన్న జయప్రద ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుండి 2014లో లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత జయప్రద బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న జయప్రద తెలుగు రాష్ట్రాల నుండి తన రాజకీయ ప్రస్థానం కొనసాగించాలని భావిస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం జయప్రద తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రవేశంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju