NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Janasena: ముగిసిన జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ భేటీ .. తీసుకున్న నిర్ణయాలు ఇవీ

TDP Janasena: జనసేన – టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన రాజమండ్రి మంజీరా హోటల్ లో సుమారు మూడు గంటల పాటు  జరిగిన ఈ సమావేశంలో టీడీపీ నుండి సమన్వయ కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య, నిమ్మల రామానాయుడు, జనసేన తరపున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బి మహేంద్ర రెడ్డి, కొటికలపూడి గోవిందరావు, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయకర్ లు పాల్గొన్నారు. సమన్వయ కమిటీ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్, లోకేష్ మీడియాతో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని అన్నారు. వైసీపీ నేతలు అన్ని పార్టీల నేతలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని గతంలోనే తాను చెప్పాననీ, రాష్ట్ర అభివృద్ధే జనసేన పార్టీకి ముఖ్యమని అన్నారు. రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు ఉండాలనే 2014 లో టీడీపీకి మద్దతు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో మద్య నిషేదం చేస్తామని చెప్పి విచ్చలవిడిగా అమ్ముతున్నారన్నారు. ఈ రాష్ట్రానికి వైసీపీ అనే తెగులు పట్టుకుందనీ, ఈ తెగులు పోవాలంటే .. జనసేన – టీడీపీ వ్యాక్సిన్ అవసరం అని అన్నారు. చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైల్ లో పెట్టారని అన్నారు. సాంకేతిక అంశాల పేరుతో బెయిల్ రాకుండా చేస్తున్నారన్నారు.

చంద్రబాబుకు మద్దతు ఇచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యామన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు తాము కలిశామన్నారు. ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించామన్నారు. టీడీపీ – జనసేన ఎలా కలిసి పని చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు పవన్ కళ్యాణ్. జనసేన ఎన్డీఏ లో భాగస్వామే అయినా ఏపీ ప్రజలే తమ ప్రాధాన్యత అని, ఏపీలో చిత్రమైన పరిస్థితితో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఓటరు లిస్ట్ విషయంలో రెండు పార్టీల కార్యకర్తలు కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అప్పులు చేసి కాకుండా అభివృద్ధితో రాష్ట్రాన్ని బాగు చేస్తామని అన్నారు పవన్. టీడీపీ – జనసేన మధ్య ఎటువంటి గొడవలు రావని, తాము కొట్టుకోమనీ, వైసీపీ వాళ్లే కొట్టుకుంటారని పవన్ అన్నారు.  2024లో టీడీపీ – జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.

నారా లోకేష్ మాట్లాడుతూ విజయదశమి రోజు టీడీపీ – జనసేన భేటీ కావడం రాష్ట్రానికి మేలు చేస్తుందని అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. వైసీపీ పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నారన్నారు. బీసీలకు రావాల్సిన  అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారన్నారు. ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ పథకాలను రద్దు చేశారని అన్నారు. నంద్యాలలో ముస్లిం సోదరుడు అబ్దుల్ కలాం, పలమనేరులో బాలిక ఆత్మహత్యలు మైనార్టీలపై వైసీపీ దాడులకు నిదర్శనమని అన్నారు. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని అన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పలు రకాలుగా వేధిస్తున్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ చేతగానితనం కనిపిస్తొందని విమర్శించారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలపై ఉమ్మడి పోరాటం సాగించేందుకు ఈ భేటీ అయ్యామని తెలిపారు. ఉమ్మడి భేటీ పూర్తిగా రాష్ట్రం కోసం, ప్రజల కోసమేనని అన్నారు. నవంబర్ 1 నుండి రెండు పార్టీల ఆధ్వర్యంలో ప్రజాపోరాటాలు చేస్తామన్నారు. సమావేశంలో మూడు తీర్మానాలు చేశారు. తొలుత జనసేన సభ్యులను లోకేష్ కు పవన్ కళ్యాణ్, టీడీపీ సభ్యులను లోకేష్ కు పవన్ కళ్యాణ్ పరిచయం చేశారు.

AP E challan scam: ఆ రిటైర్డ్ డీజీపీ అల్లుడు మామూలోడు కాదుగా..ఏకంగా రూ.36.53 కోట్లు కొట్టేశాడు

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju