NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: విశాఖ వైసీపీలో కీలక పరిణామం .. నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతల నుండి తప్పుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్..ఎందుకంటే..?

YSRCP: విశాఖ వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవి నుండి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తప్పుకున్నారు. ఈ మేరకు వాసుపల్లి గణేష్ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డికి, నగర అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్ కు లేఖ రాశారు. ఈ లేఖలో వాసుపల్లి గణేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తనకు బలనిరూపణ పెట్టడం తన గౌరవానికి భంగం కలిగించిందని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుండి తప్పుకుంటున్నట్లుగా లేఖలో పేర్కొన్నప్పటికీ అసలు కారణం వేరే ఉన్నట్లుగా సమాచారం. వాసుపల్లి గణేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికే చెందిన సీతంరాజు సుధాకర్ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. సీతంరాజుతో ఉన్న విభేదాల కారణంగానే వాసుపల్లి గణేష్ నియోజకవర్గ ఇన్ చార్జి పదవికి రాజీనామా చేశారని పార్టీ వర్గాలు భావిస్తున్నారు.

MLA vasupalli Ganesh resigns YSRCP visakha south in charge post
MLA vasupalli Ganesh resigns YSRCP visakha south in charge post

మత్సకార బీసీ వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ విద్యావేత్తగా పేరు ఉంది. 2009 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో వాసుపల్లి గణేష్ వైసీపీకి దగ్గర అయ్యారు. ఆయన కుమారులను వైసీపీలో చేర్పించి ఆ పార్టీ మద్దతు ఎమ్మెల్యేగా మారిపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆయన నియోజకవర్గ సమన్వయకర్త పదవిని కట్టబెట్టారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పార్టీ అధిష్టానం ఆయన రాజీనామాను ఆమోదిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju