NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: ఢిల్లీకి చేరిన ఏపీ రాజకీయం .. కేంద్ర పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి చేరిన నారా లోకేష్

Advertisements
Share

Nara Lokesh: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసిన నేపథ్యంలో ఏపీలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబుపై అక్రమంగా కేసు నమోదు చేసి అరెస్టు చేశారంటూ టీడీపీ సహా ఇతర రాజకీయ పక్షాలు పేర్కొంటుంటే నిధుల మళ్లింపునకు సంబంధించి పక్కా అధారాలు, చంద్రబాబు పాత్ర ఉండటం వల్లనే సీఐడీ అరెస్టు చేసిందని వైసీపీ పెద్దలు అంటున్నారు. ఇలా అధికార విఫక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ములాఖత్ కావడం, ఆ తర్వాత పొత్తులపై కీలక ప్రకటన చేయడం తెలిసిందే. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలతో కలిసి పవన్ కళ్యాణ్ జైలులో చంద్రబాబు ములాఖత్ అయి రాష్ట్రంలో భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు.

Advertisements

Pawan Kalyan made a key statement on alliances

టీడీపీ – జనసేన కలిసే వైసీపీపై పోరాటం చేస్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నారా లోకేష్ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. చంద్రబాబుతో ములాఖత్ అయిన మరుసటి రోజే నారా లోకేష్ రాజమండ్రి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై కొందరు జాతీయ స్థాయి నాయకులు, చంద్రబాబు మిత్రులు స్పందించారు. అయితే జాతీయ స్థాయిలో అనుకున్నంత స్పందన వేగంగా జరగలేదనీ, అదే విధంగా అనుకున్న విధంగా కొందరు కేంద్ర పెద్దల స్పందించలేదని టీడీపీలోని ఓ వర్గం భావిస్తొంది. వాస్తవానికి చంద్రబాబుకు జాతీయ స్థాయిలో ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఈ పాటికే భారీ ఎత్తున స్పందన రావాల్సి ఉంది.

Advertisements

అయితే చంద్రబాబు ఇప్పుడు ఇటు ఎన్డీఏ కూటమి, అటు ఇండియా కూటమిలో లేరు. ఎన్డీఏ కూటమిలో చేరేందుకు చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ బీజేపీ పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు. ప్రస్తుతం చంద్రబాబు ఏ కూటమిలో లేకపోవడంతో గతంలో చంద్రబాబుతో ఉన్న పరిచయాల ఆధారంగా ఉన్న కొందరు నాయకులు మాత్రమే చంద్రబాబు అరెస్టును ఖండించారు. చంద్రబాబు అరెస్టు, జైలుకు తరలించిన ఆ రెండు రోజుల్లోనే ఢిల్లీలో జీ 20 సదస్సులు ఉండటంతో జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్టుకు ప్రాధాన్యత లభించలేదు. దీంతో ఏపీలో చంద్రబాబు అరెస్టు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కేంద్ర పెద్దలు, ఇతర పార్టీల ముఖ్య నేతల దృష్టికి తీసుకువెళ్లాలన్న ఆలోచనతో నారా లోకేష్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నట్లు తెలుస్తొంది.

టీడీపీ ఎంపీ కే రామ్మోహన్ నాయుడుతో కలిసి లోకేష్ ఢిల్లీకి చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారని సమాచారం. అయితే నారా లోకేష్ ఎవరెవరిని కలవనున్నారు.. కేంద్ర బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చారా అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరో పక్క చంద్రబాబు అరెస్టు తీరు, తదనంతర పరిణామాలను జాతీయ మీడియా ముందు ప్రజంటేషన్ ఇవ్వడం ద్వారా.. ఇప్పటికంటే మరింత ఎక్కువగా జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చకు తెరతీయాలని టీడీపీ యోచనగా ఉన్నట్లు తెలుస్తొంది.

ఏపీ రాజకీయం ఇప్పుడు ఢిల్లీకి చేరడంతో కేంద్ర పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు అనేది చర్చనీయాంశం అవుతోంది. ఇదే క్రమంలో ఈ నెల 18వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనూ టీడీపీ ఎంపీలు చంద్రబాబు అరెస్టు అంశాన్ని లేవనెత్తాలని భావిస్తొందని, అందుకు పార్లమెంట్ సభ్యులకు దిశానిర్దేశం చేశారని తెలుస్తొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ల అపాయింట్మెంట్ లోకేష్ కు లభిస్తుందా లేదా అన్నదానిపైనా చర్చ జరుగుతోంది.

Chandrababu Advocate Sidharth Luthra Tweets: చంద్రబాబు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా ఆసక్తికర ట్వీట్‌లు ..సోషల్ మీడియాలో వైరల్


Share
Advertisements

Related posts

ABN RK: గేమ్ లో ఇరుక్కున్న జగన్..? 2024 టార్గెట్ గా భారీ ప్లాన్..?

Srinivas Manem

Bigg boss 4: బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హోస్ట్ గా తప్పుకుంటున్న నాగార్జున?

Varun G

Prabhas : ప్రభాస్ లేకుండా ఆ సినిమా షూటింగ్ జరుగుతందా..?

GRK