Nara Lokesh: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఊరట లభించింది. నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవేళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంలో సీఐడీ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి కీలక విషయాన్ని తెలియజేశారు. స్కిల్ కేసులో నారా లోకేష్ ను ఈరోజు వరకూ నిందితుడుగా చేర్చలేదనీ, ఒక వేళ నిందితుడుగా చేరిస్తే సీఆర్పీసీ 41 ఏ నోటీసులు ఇస్తామని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో అరెస్టు అంశం లేకపోవడంతో హైకోర్టు నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోర్ చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో గత నెల 9వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నారా లోకేష్ ను కూడా ఈ కేసులో అరెస్టు చేస్తారంటూ పలువురు వైసీపీ నేతలు పేర్కొనడంతో పాటు సీఐడీ చీఫ్ కూడా నారా లోకేష్ పాత్రపై విచారణ జరుపుతున్నామని పేర్కొనడంతో లోకేష్ ఇంతకు ముందు హైకోర్టును ఆశ్రయించారు. తొలుత హైకోర్టు లోకేష్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

లోకేష్ ముందస్తు బెయిల్ పై ఈ నెల 4వ తేదీన హైకోర్టులో విచారణకు రాగా..12వ తేదీ వరకూ లోకేష్ కు ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ గడువు నేటితో ముగుస్తున్నందున ఈ వేళ హైకోర్టులో లోకేష్ పిటిషన్ పై విచారణ జరిగింది. సీఐడీ ఇచ్చిన సమాచారంతో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. మరో పక్క స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ 17వ తేదీకి వాయిదా పడింది.
అంగళ్ల కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ, చంద్రబాబు తరపున న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఉత్తర్వులను రేపు వెలువరిస్తామని కోర్టు తెలిపింది.
Telangana TDP: తెలంగాణ టీడీపీకి బిగ్ ఝలక్ ..! కారు ఎక్కేందుకు సిద్దమవుతున్న ఓ సీనియర్ నేత